తెలంగాణ

telangana

కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? : జస్టిస్‌ పీసీ ఘోష్‌ - Judicial Inquiry On Kaleshwaram

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 9:19 AM IST

Kaleshwaram Project Judicial Inquiry Updates : కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలు అంశాలపై మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు కమిషన్‌ ప్రశ్నలు సంధించింది. వీటిపై ఆయన కమిషన్‌కు వివరణ ఇచ్చారు. మరోవైపు జస్టిస్‌ పీసీ ఘోష్‌ రెండో విడత విచారణ నేటితో ముగియనుంది.

Kaleshwaram Project Judicial Inquiry Updates
Kaleshwaram Project Judicial Inquiry Updates (ETV Bharat)

Justice PC Ghose Commission Inquiry on Kaleshwaram :కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్టలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ (పీసీ ఘోష్‌) నేతృత్వంలో న్యాయ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించారు. శనివారం నాడు హైదరాబాద్‌లోని బీఆర్కేభవన్‌లోని కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్‌ కార్యాలయంలో ఆయన నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో మరోమారు భేటీ అయ్యారు.

ఈఎన్సీలు నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌, సీఈ సుధాకర్‌రెడ్డిలతో సమావేశమైన అనంతరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లుతోనూ జస్టిస్ పీసీ ఘోష్‌ భేటీ అయ్యారు. జస్టిస్‌ ఘోష్‌ ఎత్తిపోతలకు సంబంధించిన వివరాలపై వెంకటేశ్వర్లును ప్రశ్నలు అడుగగా ఆయన సమాధానాలు ఇచ్చారు. అందిన సమాచారం మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందని కమిషన్‌ అడిగిన ప్రశ్నకు, లైడార్‌ సర్వేలో వచ్చిన ఫలితాలు, వ్యాప్కోస్‌ సంస్థతో సర్వే, మహారాష్ట్రలో ముంపు ఉండటంతోనే మేడిగడ్డ వద్దకు మార్చాల్సి వచ్చిందని మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కమిషన్‌కు తెలిపారు.

Kaleshwaram Barrages Issue Updates :మేడిగడ్డ ఆనకట్ట డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయన్న దానిపై, మేడిగడ్డను స్పెషల్‌గా డిజైన్‌ చేసినట్లు, బ్యారేజీ కమ్‌ డ్యాం తీరులో ఉపయోగించుకునేలా నిర్మాణం చేపట్టినట్లు మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కమిషన్‌కు వివరించారు. ప్రాజెక్టు తీరుపై మాజీ ఈఎన్సీ కొంత నిడివితో కూడిన ప్రజంటేషన్‌ ఇవ్వడంతో పాటు తనకు 2 గంటల సమయం ఇస్తే మరిన్ని వివరాలు అందజేస్తానని కమిషన్‌కు చెప్పినట్లు తెలిసింది.

కాళేశ్వరంపై విచారణలో కమిషన్​కు సాయమందించేందుకు మూడు బృందాలు - త్వరలో నియామకం - Judicial Inquiry On Kaleshwaram

మరోవైపు కమిషన్‌ ఆదేశం మేరకు మూడు ఆనకట్టలకు సంబంధించిన నోట్‌ను సీఈ సుధాకర్‌రెడ్డి జస్టిస్‌ పీసీ ఘోష్‌కు అందజేశారు. రెండో విడత విచారణలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చి విచారణ చేపట్టిన ఆయన ఆదివారం కోల్‌కతాకు వెళ్లనున్నారు. ఈ నెలాఖరున మరోమారు వచ్చి విచారణ జరపనున్నట్లు తెలిసింది.

14న ఎస్‌ఈలు, ఈఈలతో ఈఎన్సీ సమావేశం :మేడిగడ్డ ఆనకట్ట రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై 14న నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్‌ ప్రాజెక్టు ఎస్‌ఈలు, ఈఈలతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు, సిఫార్సులు అందించేలోగా తీసుకోవాల్సిన చర్యలపై ఈఎన్సీ ఇంజినీర్లతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

'గుత్తేదారు స్పందించకపోతే - అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు' - Judicial Inquiry On Kaleshwaram

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ - Justice PC Ghose on Medigadda

ABOUT THE AUTHOR

...view details