తెలంగాణ

telangana

సోషల్ మీడియాను వదల్లేకపోతున్నారా? - ఇలా ట్రై చేయండి!

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 10:09 AM IST

How to Take a Break From Social Media : సోషల్ మీడియా వల్ల ఉపయోగాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయి. అందులో మునిగిపోయి గంటలు గంటలు టైమ్ వేస్ట్ చేయడం ఒకెత్తయితే.. దానికి క్రమంగా బానిసైపోవడం మరో ఎత్తు. ఈ స్థితికి చేరుకున్నవారు మానసిక సమస్యలు సైతం ఎదుర్కొంటారని ఇప్పటికే చాలా మంది నిపుణులు హెచ్చరించారు. మరి.. అందులో నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం.

How to Take a Break From Social Media
How to Take a Break From Social Media

How to Take a Break From Social Media : "నేను సోషల్ మీడియాను శాశ్వతంగా వదిలేస్తున్నాను" అని ప్రకటించి వారం కూడా గడవకుండానే తిరిగి ప్రత్యక్షమయ్యేవాళ్లు ఎంతో మంది! వారిలో మీ మిత్రులు ఉండొచ్చు.. చివరకు అది మీరు కూడా కావొచ్చు! మరి.. ఎందుకిలా? బయటపడడానికి ప్రయత్నిస్తున్నా.. తిరిగి అందులోకే ఎలా జారిపోతున్నారు? ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి?

సోషల్ మీడియా ద్వారా పలు ఉపయోగాలు ఉన్నాయి. వేగంగా కొత్త సమాచారం తెలుసుకోవచ్చు. అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. చర్చలు చేయవచ్చు. ఫేమ్ సంపాదించుకోవచ్చు. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు నష్టాలు కూడా ఉన్నాయి. అవతలి వ్యక్తి ఎవరన్నది కూడా తెలియకుండా ఫ్రెండ్షిప్ చేసి మోసపోతుంటారు. గంటలు గంటలు సమయం వృథాఅయిపోతూ ఉంటుంది. మానసిక సమస్యలు తలెత్తడం ఇందులో అతిపెద్దది. రకరకాల భావోద్వేగాలతో డిప్రెషన్ స్థాయికి వెళ్లేవారు కోకొల్లలు. కొందరు ఈ విషయాన్ని గుర్తించి.. అందులోనుంచి బయటపడేలా ప్రయత్నిస్తారు. కానీ.. సాధ్యం కాదు. కొన్ని రోజులు విరామం అంటూ ప్రకటిస్తారు. తిరిగి వెంటనే కనిపిస్తారు. మరికొందరు పూర్తిగా వదిలేస్తామని ఫిక్స్ అయిపోతారు.. కొన్ని రోజులకే ప్రత్యక్షమవుతారు. అంటే.. అంతగా అడిక్ట్ అయ్యారని అర్థం. ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా ఉన్నారా? అయితే.. కొన్ని టిప్స్ పాటించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

టార్గెట్ ఫిక్స్ చేయండి :ఒకేసారి సోషల్ మీడియాను వదిలేయాలనే నిర్ణయం వద్దు. ముందుగా బ్రేక్స్ ఇవ్వండి. అది కూడా ఒక వారం రోజులు అని అనుకోవడం కాదు.. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అన్నది క్లియర్​గా నిర్ణయించుకోండి. దీనివల్ల పలానా తేదీ వరకు ముట్టుకోవద్దు అనే క్లారిటీ ఉంటుంది.

మీ వాళ్లకు చెప్పండి : కేవలం మీ మనసులో అనుకొని ఉండకండి. మీరు బ్రేక్ ఇస్తున్న విషయం మీ ఫ్రెండ్స్​కు, ఫాలోవర్స్​కు చెప్పండి. దీనివల్ల మధ్యలో ఓపెన్ చేయాలని అనిపించినా.. వారికి సమాధానం చెప్పాల్సి వస్తుందన్న ఆలోచన అడ్డుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి.. మీ వాళ్లకు చెప్పి చేయండి.

యాప్ డెలిట్ చేయండి : ఫోన్ నిరంతరం చేతిలోనే ఆడుతూ ఉంటుంది కాబట్టి.. ప్రతిసారీ సోషల్ మీడియా యాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. వాటిని చూసినప్పుడల్లా ఓసారి ఓపెన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కాబట్టి.. మీరు బ్రేక్ తీసుకునే రోజునే డెలిట్ చేయండి. కావాలంటే ఆ తర్వాత మళ్లీ ఇన్​స్టాల్ చేసుకోవచ్చు. ఇది తప్పక చేయాల్సిన పని.

ఓ పని పెట్టుకోండి : ఉదయం, సాయంత్రం వేళల్లో మీకు నచ్చిన ఏదైనా పని చేసేలా ప్లాన్ చేసుకోండి. బొమ్మలు వేయడం, గార్డెనింగ్, మిత్రులను కలవడం వంటి పని ఏదో ఒకటి పెట్టుకోండి. మార్నింగ్ వాక్ చేస్తే ఆరోగ్యంతోపాటు ఉల్లాసంగా ఉంటారు.

ఇలా చేయడం వల్ల మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మనసు అటువైపే లాగుతుంది. ఇలాంటప్పుడు మీ మనసుకు సర్దిచెప్పండి. సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలేంటో గుర్తు చేసుకోండి. అది మిమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతోందో గుర్తు చేసుకోండి. ఇలా ఇబ్బంది పెట్టేది మనకు అవసరమా? అని ప్రశ్నించుకోండి. దీంతో.. మనసు వాస్తవాన్ని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత అంగీకరిస్తుంది. మీ బ్రేక్ గడువు ముగిసిన తర్వాత అవసరం అనుకుంటే మళ్లీ ఇన్​ స్టాల్ చేయండి. సాధ్యమైనంత త్వరగా మళ్లీ అన్ ఇన్ స్టాల్ చేయండి. ఇలా కొన్ని బ్రేక్స్ తర్వాత.. క్రమంగా సోషల్ మీడియాపై ఆసక్తి తగ్గుతుంది.

ABOUT THE AUTHOR

...view details