తెలంగాణ

telangana

వానాకాలంలో వరి పంటవైపే అన్నదాతల మొగ్గు - 65 లక్షల ఎకరాల్లో సాగు అంచనా! - PADDY CULTIVATION IN TELANGANA 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 7:55 AM IST

Monsoon Cultivation in Telangana : రైతులు ఈసారి వానాకాలంలో వరి, పత్తి పంటపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందుకు ఇప్పటి నుంచే వ్యవసాయ ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయనున్నారని అంచనా.

Monsoon Cultivation in Telangana
Monsoon Cultivation in Telangana

Monsoon Cultivation in Telangana : రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం వర్షాలు దంచికొడతాయనే వాతావరణ శాఖ తీపి కబురు చెప్పిన నేపథ్యంలో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వరిని దాదాపు 65 లక్షల ఎకరాల్లోనూ, పత్తిని 60.53 లక్షల ఎకరాల్లోనూ సాగు చేస్తున్నారని భావిస్తున్నారు. ఇందుకు ఇప్పటి నుంచే వ్యవసాయ శాఖ వానాకాలం సీజన్​ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

ఈ ప్రణాళికలో సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడిస్తున్న నేపథ్యంలో మొత్తం 1.50 కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసే అవకాశం ఉందని గుర్తించింది. వ్యవసాయ శాఖ వానాకాల ప్రణాళికలో రాష్ట్రంలో ముందస్తు వాతావరణ పరిస్థితులు, మార్కెట్లలో లభించిన ధరలు, వాతావరణ పరిస్థితులు అంచనాల ప్రాతిపదికన తీసుకుంది.

పత్తి సాగు భేష్​ : గత వానాకాలం సీజన్​లో రాష్ట్రంలో వరి 64 లక్షల ఎకరాల్లోనూ, పత్తి 44.77 లక్షల ఎకరాల్లోనూ సాగైంది. యాసంగిలో మాత్రం వర్షాభావం, సాగునీరందక ఆశించిన మేర సాగు కాలేదనే చెప్పాలి. ఈసారి మంచి వర్షాలే ఉంటాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో ఈ రెండు పంటలు గత ఏడాది వానాకాలం సీజన్​కు మించి సాగయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పత్తికి మంచి ధరలు రావడంతో అన్నదాతలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే కొనుగోళ్లు సజావుగా సాగడంతో రైతులు నిరుటి కంటే ఎక్కువగా సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చింది.

Mrugashira Karthe : పంట సాగుపై అన్నదాతల అయోమయం

గత వానాకాలం సీజన్​లో మొక్కజొన్న 5.27 లక్షల ఎకరాల్లో పండించారు. ఈ పంట వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడంతో పాటు మద్దతు ధర కూడా మంచిగానే లభించింది. దీంతో ఈసారి 10 లక్షల ఎకరాల వరకు మొక్కజొన్న వేసే అవకాశం ఉంది. సోయాబీన్, కందులు అయిదేసి లక్షల ఎకరాల్లోనూ, మినుములు, చిరుధాన్యాలు ఇతర పంటలు కలిపి మరో రెండు లక్షల ఎకరాల్లోనూ, వేరుసెనగ, పెసలు, జొన్న లక్ష ఎకరాల చొప్పున పండిస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.

విత్తనాలు, ఎరువుల సరఫరాకు సన్నాహాలు :విత్తనాలు, ఎరువుల సరఫరాకు వ్యవసాయ శాఖ సరఫరా చేస్తోంది. విత్తనాల పరంగా చూస్తే పత్తి 121.16 లక్షల ప్యాకెట్లు, మక్కలు 48 వేల క్వింటాళ్లు, వరి 16.50 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇతర పంటల విత్తనాల లభ్యతకూ ఆ శాఖ చర్యలను చేపట్టింది. దాదాపు 5 లక్షల మెట్రిక్​ టన్నుల ఎరువులను జూన్​ మొదటి వారం వరకే నిల్వ చేయనున్నారు. అలాగే వ్యవసాయ శాఖ 4.50 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా నిల్వకు సన్నాహాలు చేస్తోంది.

ప్రకృతితో స్నేహం రాజమ్మతాండ ఆరోగ్య రహస్యం - చావుకే సవాల్ విసురుతున్న గ్రామం

Cultivation in Telangana 2022 : ఎకరానికి రూ.10 లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగంటే?

ABOUT THE AUTHOR

...view details