తెలంగాణ

telangana

వ్యర్థాలతో కళాకృతులు రూపొందిస్తూ - ఔరా అనిపిస్తున్న బధిర విద్యార్థి - Def and Dem Student Talent

By ETV Bharat Telangana Team

Published : Apr 21, 2024, 4:57 PM IST

Def and Dem Student Talent in Medak : అనుకున్నది సాధించాలంటే అంగవైకల్యం అడ్డు కాదంటూ నిరూపిస్తున్నాడు ఆ విద్యార్థి. చదువులో చురుగ్గా ఉంటూనే వినూత్న ఆవిష్కరణలకు చేస్తున్నాడు. 10 నిమిషాల వ్యవధిలో ఎదుట ఉన్న మనిషి బొమ్మని గీస్తూ ఔరా అనిపిస్తున్నాడు. సాధారణ విద్యార్థులకు భిన్నంగా ప్రతిభ కనబరుస్తు బహుమతులు సొంతం చేసుకుంటున్న ఆ విద్యార్థిపై ప్రత్యేక కథనం

Disabled PERSON Madan Inspiring With Skill
Def and Dem Student Talent

వ్యర్థాలతో కళాకృతులు రూపొందిస్తు ఔరా అనిపిస్తున్న బధిర విద్యార్థి

Def and Dem Student Talent in Medak: మెదక్‌ జిల్లా శివ్వంపేటకు చెందిన మదన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మాటలు రాకపోయిన, చెవులు వినిపించకపోయిన నిరుత్సాహపడలేదు మదన్‌. ప్రతిభ చాటడానికి అవేవి అడ్డు కాదంటూ నిరూపిస్తున్నాడు. చిన్నప్పట్నుంచి వ్యర్థాలతో బొమ్మలు తయారు చేస్తున్నాడు. చిత్రాలు గీయడంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. తాను గీసిన చిత్రాలు, చేసిన బొమ్మలు బడిలో ప్రదర్శిస్తున్నాడు.

చిత్రకళ పోటీల్లో పాల్గొంటూ బహుమతులు అందుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు బాలచంద్రం చెబుతున్నారు. ఎవరినైనా చూసిన వెంటనే అచ్చుగుద్దినట్లుగా బొమ్మ వేయడం అతని ప్రత్యేకతని తెలిపారు. భవిష్యత్తులో మరింత రాణించేలా ఈ బాలుడిని తీర్చిదిద్దుతామని ఆయన చెబుతున్నారు.

కిక్ కొడితే గోల్ పోస్ట్​లోకి గ్యారెంటీ - వావ్ అనిపిస్తున్న మిర్యాలగూడ కుర్రాడు - Student Who Excels In Football

Disabled Person Madan Inspiring With Skill : దేశంలో ఏదైన కొత్త విషయం జరిగిందంటే వెంటనే దాని నమూనాను తయారు చేయాలనే ఆసక్తితో మధన్‌ నిరంతరం ఉత్సాహంగా ఉంటాడు. తోటి విద్యార్థులకు ఆలోచన రేకేత్తించే మదన్‌ ప్రవర్తన ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తన ప్రతిభతో వారికి ప్రేరణగా నిలుస్తున్నాడని అంటున్నారు.

మదన్ ప్రతిభను ఏడో తరగతి చదువుతున్నప్పుడే ఉపాధ్యాయులందరం గుర్తించాం. ఈ టాలెంట్​ను జిల్లా స్థాయిలో చూపించేందుకు డివిజన్​ స్థాయిలో జరిగే ప్రతి డ్రాయింగ్​ పోటీలకు పంపిస్తున్నాం. విద్యార్థి నైపుణ్యం మరింతగా ప్రోత్సహిస్తే సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాడు. తనకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. - చాలచంద్రం, ప్రధానోపాధ్యాయులు,శివ్వంపేట

సంస్కృతం ఎగ్జామ్​కు ఒకే ఒక్క విద్యార్థిని- డ్యూటీలో 8 మంది సిబ్బంది!

"ప్రతి రోజు స్కూల్​కి వెళ్తాడు. తిరిగి ఒక్కడే రాగలడు. ఇంట్లో ఏదైనా పని చెప్పినా చేస్తాడు. డ్రాయింగ్​ బాగా వేస్తాడు. అట్ట ముక్కలు, చెక్క ముక్కలతో బొమ్మలు తయారు చేస్తాడు. మేము కూడా అలా చేయమనే చెబుతాం. మా అబ్బాయికి పింఛన్​ కూడా రావడం లేదు. ప్రభుత్వ తరుఫున సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం." - నర్సింహులు , బాలుడి తండ్రి

Student Madan Making Things with Waste Material : మిగతా వారిలా అన్ని పనులు సొంతంగా చేసుకుంటూనే బొమ్మలు వేయడం, నమూనాలు తయారు చేయడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారున్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి కళల్లో బాలుడిని ప్రోత్సహిస్తే మరింత రాణించే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు వచ్చి మెరుగైన వైద్యం అందించేందుకు సహాయం చేయాలని ఆశిద్దాం.

బెత్తంతో టీచర్​కు పనిష్మెంట్- తప్పు చేసిన స్టూడెంట్స్​ మాత్రమే కొట్టాలి- ఎక్కడో తెలుసా? - STUDENTS PUNISHED TEACHER

పేదరికం నేర్పిన పాఠం - వ్యవసాయం కూలీ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్రపీఠం

ABOUT THE AUTHOR

...view details