తెలంగాణ

telangana

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సతీసమేతంగా దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Mar 11, 2024, 12:18 PM IST

Updated : Mar 11, 2024, 1:57 PM IST

CM Revanth Visited Yadadri Temple : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్‌రెడ్డి సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రికి వేద పండితులు వేదాశ్వీరచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

CM Revanth Visited Yadadri Temple
CM Revanth Visited Yadadri Temple

CM Revanth Visited Yadadri Temple :యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. సీఎం హోదాలో మొదటిసారి ఆయన యాదగిరిగుట్టకు రావడంతో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు రేవంత్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సతీసమేతంగా దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులకు వేద పండితలు వేదాశీర్వచనం అందజేశారు. సీఎంతో వెంట మంత్రులు భట్టి విక్రమార్క, కొండా సురేఖ, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి, మంత్రులు హెలికాప్టర్‌లో భద్రాచలం బయల్దేరారు.

Yadadri Brahmotsavam 2024 : మరోవైపు ఈరోజు నుంచి యాదాద్రీశుల (Yadadri Temple) వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తిరుమంజనంతో గర్భగుడిని శుద్ధి చేశారు. ప్రప్రథమంగా విష్వక్సేన ఆరాధన, స్వస్తివచనం నిర్వహించారు. సాయంత్రం మృత్స్యంగ్రహణం, అంకురార్పణ పర్వాలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, హవనం, దేవతలకు ఆహ్వానం క్రతువులు నిర్వహిస్తారు.

యాదాద్రి ఆలయానికి మరో ఘనత రూ.5.40 కోట్లలో విమాన గోపురానికి రాగి తొడుగు

Yadadri Lakshinarasimha swamy Temple : పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు (Yadadri Brahmotsavam) రూ.1.60 కోట్లు కేటాయించారు. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు నిర్వహించనున్నారు 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరగనుంది. 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు, స్వస్తి పుణ్యహవాచనంతో శాస్త్రోక్తంగా ఆరంభమై, ఈ నెల 21న అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మాడవీధిలో భక్తులు ఎండ నుంచి ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు, తాగునీటి కోసం ప్రత్యేక కుళాయిలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఈనెల 11నుంచి 21 వరకు ఆలయంలో పలు సేవలను రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఆర్టీసీ ద్వారా అదనపు బస్సు సర్వీసులను నడపుతుంది. తీర్థజనులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

ఘనంగా చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు - అగ్నిగుండాలు దాటి మొక్కులు చెల్లించుకున్న భక్తులు

యాదాద్రి పాతగుట్టలో ముగిసిన అధ్యయనోత్సవాలు - రేపటి నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు

Last Updated : Mar 11, 2024, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details