తెలంగాణ

telangana

ముఖ్యమంత్రిని కలిసిన రోహిత్‌ వేముల తల్లి - పునర్విచారణ చేసి న్యాయం చేస్తామన్న రేవంత్​ రెడ్డి - Rohit Vemula Suicide Case Update

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 1:38 PM IST

CM Revanth Reddy React on Rohit Vemula Suicide Case : హైదరాబాద్​ సెంట్రల్​ వర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్​ వేముల తల్లి రాధిక సీఎం రేవంత్​ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Telangana DGP Order to Rohit Vemula Case Reopen
CM Respond on Rohit Vemula Case (ETV Bharat)

CM Revanth Reddy React on Rohit Vemula Suicide Case : హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్‌ ఆత్మహత్య వ్యవహారంలో వర్సిటీ వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాల్లేవంటూ కోర్టు విచారణను ముగించిన నేపథ్యంలో రోహిత్‌ తల్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. న్యాయం జరిగేలా చూడాలని చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. కేసును పునర్విచారిస్తామని డీజీపీ సైతం ప్రకటించినందున ఈ మేరకు అనుమతివ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నారు.

Rohit Vemula Suicide Case : 2016 జనవరిలో హైదరాబాద్​ సెంట్రల్​ వర్సిటీలో రోహిత్​ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. దళితుల హక్కుల కోసం పోరాడుతున్నాడన్న కారణంతో అతడిపై వేధింపులకు పాల్పడి, ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలు చేశాయి. విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని పలువురు డిమాండ్ చేశారు.

రోహిత్ వేముల కేసులో కీలక మలుపు - పునర్విచారణకు డీజీపీ నిర్ణయం - ROHIT VEMULA DEATH case

Telangana HC onRohit Vemula Suicide Case : రోహిత్​ వేధించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రశాంత్​ అనే పీహెచ్​డీ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో వీసీ అప్పారావు, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్.రాంచంద్రారావు, స్మృతి ఇరానీల పేర్లు తెలిపాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా రోహిత్​ దళితుడని అవమానించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లేవని గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 2వ తేదీన హైకోర్టుకు నివేదికను సమర్ఫించారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, పిటీషన్‌పై విచారణను ముగించేసింది. పోలీసుల నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే సంబంధిత కోర్టుకు వెళ్లాలని ప్రతివాదియైన ప్రశాంత్ తరఫు న్యాయవాదికి సూచించింది.

DGP React on Rohit Vemula Case : హైకోర్టు ఈ కేసును ముగించేయడంతో హెచ్​సీయూలోని విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా నిలవరించేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్​ వేముల ఆత్మహత్య కేసును పునర్విచారణ చేస్తామని డీజీపీ రవిగుప్తా ప్రకటించారు. ఈ కేసు తీర్పు విషయంలో రోహిత్​ తల్లి అనుమానం వ్యక్తం చేయడం, విద్యార్థుల నిరసనలు చేపట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్​ వేయనున్నారు. ఈ సందర్భంగా రోహిత్​ తల్లి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి న్యాయం జరిగేలా చేస్తామని, మళ్లీ విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.

థాయ్ విద్యార్థినిపై హెచ్‌సీయూ ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. భగ్గుమన్న విద్యార్థులు

HCU: హాస్టల్ విద్యార్థులను ఇళ్లకు వెళ్లిపోవాలని కోరిన హెచ్‌సీయూ

ABOUT THE AUTHOR

...view details