తెలంగాణ

telangana

తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డలకు 'పద్మ' పురస్కారం - శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2024, 2:18 PM IST

CM Revanth Padma Awardees Wishes 2024 : తెలుగు రాష్ట్రాల నుంచి 'పద్మ' అవార్డుకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మాజీ ఉపరాష్ట్రపతి, నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్, తెలంగాణ వాసి గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డులు దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

EX CM KCR Wishes To Padma Award Winners
CM Revanth Reddy Wishes To Padma Award Winners 2024

CM Revanth Padma Awardees Wishes 2024 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 5 మందికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించగా వారిలో ఏపీకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి ఉన్నారు. పద్మశ్రీ పురస్కారం 34 మందికి ప్రకటించగా తెలంగాణకు చెందిన ఐదుగురు కళాకారులను ఈ పురస్కారం వరించింది. జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప అవార్డుల జాబితాలో ఉన్నారు. ఈ తరుణంలో పద్మ అవార్డు గ్రహీతలకు ప్రముఖలు అభినందనలు తెలుపుతున్నారు.

Padma Vibhushan Awardees Telangana 2024 :పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరి కొండప్ప, జనగామకు చెందిన గడ్డం సమ్మయ్యను (Pdma Sri Gaddam Sammayya) ఎక్స్ వేదికగా అభినందించారు. అద్భుతమైన కళా నైపుణ్యంతో వీరిద్దరూ తెలంగాణ సంస్కృతి కళను దేశమంతటా చాటి చెప్పారని సీఎం రేవంత్ ప్రశంసించారు.

తెలుగు రాష్ట్రాల్లో 'పద్మ' పురస్కారం వరించిన కళాకారులు వీళ్లే

EX CM KCR Wishes To Padma Award Winners 2024 : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ (Padma Vibhushan 2024) వరించడం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ ప్రజా సంస్కృతికి ప్రతీక అయిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ (Padma Sri) అవార్డు దక్కడం పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

క్రీడా రంగంలో విరిసిన 'పద్మాలు' - బోపన్నతో పాటు ఆ 6 మందికి

తరతరాలుగా తెలంగాణ జన జీవితాల్లో భాగోతం పేరుతో భాగమైన సాంస్కృతిక కళారూపం యక్షగానమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో ఈ కళారూపం కళాకారులు భాగమైన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్​లాల్, కురెల్ల విఠలాచార్యలకు అభినందనలు తెలిపారు.

ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ అవార్డులకు ఎన్నికైన వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వారు ఈ అవార్డుకు ఎంపికవ్వడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పలు రంగాలకు చెందిన సృజనకారులు, ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్​లాల్, కురెల్ల విఠలాచార్యలకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం- తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మశ్రీ

వెంకయ్యనాయుడు, చిరంజీవి సహా ఐదుగురికి పద్మవిభూషణ్ పురస్కారం

ABOUT THE AUTHOR

...view details