తెలంగాణ

telangana

క్యాటరింగ్ మాటున వేధింపుల దందా - వ్యక్తి అరెస్ట్​ - Catering Calls Issue in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 4:44 PM IST

Catering Calls Issue in Hyderabad : పేరుకే క్యాటరింగ్ బిజినెస్​, సర్వీస్​ వినియోగించుకున్నారంటే వేధింపులకు గురికావాల్సిందే. ఒప్పంద రుసుం కంటే అదనపు సొమ్ము అడగటం, ఇవ్వకుంటే కస్టమర్ల మొబైల్ నంబర్లను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం. ఇదీ ఓ ఆగంతకుడి దందా వ్యాపారం. అటువంటి వ్యక్తిని బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్​ డీసీపీ కవిత అరెస్ట్​ చేసినట్లు వెల్లడించారు.

Hyderabad Cyber Cases
Catering Calls Issue in Hyderabad

Catering Calls Issue in Hyderabad : క్యాటరింగ్‌ బిజినెస్‌ చేస్తూ, వేధింపులకు పాల్పడుతున్న వున్నూరు స్వామి అనే నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు సైబర్‌ క్రైమ్ (Cyber Crime) డీసీపీ ధార కవిత తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో క్యాటరింగ్ చేసినందుకు రూ.7వేలకు ఓ కస్టమర్​ వద్ద నిందితుడు ఒప్పందం చేసుకున్నాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత రూ.15వేలు ఇవ్వాలని బాధితుడిని డిమాండ్‌ చేశాడు.

అతడు అదనపు డబ్బులు ఇవ్వకపోవడంతో వారికి సంబంధించిన నంబర్లను అనధికార సైట్లలో పెట్టడం, కాల్‌ గర్ల్స్​ కోసం వీరిని సంప్రదించండి అంటూ, నిందితుడు సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అంతేగాక పబ్లిక్‌ టాయిలెట్స్‌, మెట్రో పిల్లర్ల(Metro Pillars) వద్ద కూడా ఇలాగే నంబర్లు రాయడంతో గంటల వ్యవధిలోనే బాధితుడికి వందల ఫోన్లు వచ్చాయి. దీంతో బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి, నిందితుడిని అదపులోకి తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.

రూ.20 కోట్లు కాజేసిన సైబర్​ కేటుగాళ్లు - పెట్టుబడుల పేరుతో లూటీ చేస్తున్న ఇద్దరి అరెస్టు - Police Arrested Two Cyber Criminals

"క్యాటరింగ్ సర్వీస్​ కావాలంటే ఫలానా నంబర్​కు కాంటాక్ట్​ అవ్వండి అని ప్రకటనలు చేస్తుంటారు. శుభకార్యాలకు పలు కార్యక్రమాల కోసం క్యాటరింగ్ కావాల్సిన కస్టమర్లు, వీరిని సంప్రదిస్తుంటారు. అయితే వారి నంబర్లను జాగ్రత్తపరచుకొని, ఈవెంట్​ అయిపోయిన తరవాత ఒప్పంద సొమ్ము కంటే అధికంగా డిమాండ్​ చేస్తారు. ఇవ్వకుంటే వారి నంబర్లను సోషల్ మీడియాల్లో, కాల్​ గర్ల్స్​ కోసం ఈ నంబర్లను సంప్రదించండి అంటూ ఎక్కడపడితే అక్కడ పోస్ట్​ చేస్తారు. ఇలా వేధింపులకు గురిచేస్తూ ఒకరకమైన మెంటల్​ టార్చర్​ను కలుగజేస్తారు. బాధితుడు ఫిర్యాదు మేరకు, నిందితుడును అరెస్ట్​ చేయడం జరిగింది." -ధార కవిత, సైబర్​క్రైమ్​ డీసీపీ

Hyderabad Cyber Cases : గతంలో పలువురి విషయంలోనూ ఇదే విధంగా ప్రవర్తించినట్లు తెలిపారు. మరో 11 కేసుల్లో స్వామి నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఎప్పటికప్పుడు చరవాణి నంబర్లు(Mobile Numbers) మారుస్తున్నాడని, ఇప్పటికి 30 నంబర్లు మార్చినట్లు తెలిపారు. నిందితుడి నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

మరోవైపు పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సైబర్‌ క్రైం డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితులు ఇద్దరూ కేరళలో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ రెండు కేసు వివరాలను ఇవాళ ఆమె మీడియాకు(Press Meet) వెల్లడించారు.

క్యాటరింగ్ పేరుతో బిజినెస్​ దందా - వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తి అరెస్ట్​

మీ బైక్​ పోయిందా? అయితే ఇక మర్చిపోవడమే! - ఎందుకో తెలుసా? - Bike Theft Cases in Hyderabad

సైబర్ కేఫ్‌ రిపోర్టులో నమ్మలేని నిజాలు- ఆ బ్యాంకుల కస్లమర్లే అధిక బాధితులట - cyber crime in banking sector

ABOUT THE AUTHOR

...view details