తెలంగాణ

telangana

చేరికలు, బస్సు యాత్రలు, నారీ శక్తి వందన్​తో ప్రజల్లోకి - ఫిబ్రవరి నెలంతా బీజేపీ బిజీబిజీ

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 7:38 AM IST

BJP Focus On Parliament Elections 2024 : లోక్​సభ ఎన్నికలకు కాషాయ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు నిర్ణయించింది. ఫిబ్రవరి నెలంతా నాయకులు, కార్యకర్తల ముందు పెద్ద లక్ష్యాన్ని పెట్టింది. నిత్యం బిజీబిజీగా ఉంచేలా కార్యక్రమాలను రూపొందించింది. ఒకవైపు చేరికలతో పాటు మరో వైపు బస్సు యాత్రలతో పార్టీకి ఊపు తీసుకురావాలని వ్యూహాలు రచించింది. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లో అసంతృప్త నేతలను పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తోంది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేర్చుకోవాలని రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

BJP Parliament Election 2024
BJP Focus On Parliament Election 2024

రాష్ట్రానికి ఆరు గ్యారెంటీలు కాదు - మోదీ గ్యారెంటీతోనే భవిష్యత్‌ : డికె అరుణ

BJP Focus On Parliament Election 2024 : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ స్థాయి మొదలు ఎదురైన లోపాలను సరిచేసుకుని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(BJP) నిర్ణయించింది. క్యాడర్​ను బలోపేతం చేయాలంటే గ్రామస్థాయిలో నిత్యం కొత్తగా చేరికలను ప్రోత్సహించాలని రాష్ట్ర నాయకత్వం నాయకులు, కార్యకర్తలకు ఆదేశించింది. ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లే కాకుండా సామాజిక సేవ చేసే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫిబ్రవరి మొత్తం చేరికల కోసం కేటాయించాలని, అందరూ దీనిపై దృష్టి సారించాలని పార్టీ నిర్దేశించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి - ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి : కిషన్​రెడ్డి

BJP Parliament Election 2024 :మరోవైపు రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు చేపట్టనుంది. 17 లోక్​సభ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించింది. ఈ నెల 10 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బస్సు యాత్రలు చేపట్టనుంది. దీనికి సంబంధించిన నిర్వహణ, రూట్ మ్యాప్​పై పదాధికారుల సమావేశంలో చర్చించారు.పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 4, 5, 6 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గ ప్రవాస్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నెల 18 నుంచి 24 వరకు నారీ శక్తి వందన్ అనే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 27, 28, 29 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులతో భేటీ అయ్యే కార్యక్రమాలను చేపట్టనుంది.

Lok Sabha Election 2024 :దీనికి లాభార్థి సంపర్క్ యోజనగా పేరు పెట్టింది. ఈ నెల 14న పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించాలని రాష్ట్ర నాయకత్వం నాయకులను ఆదేశించింది. ఫిబ్రవరి 29లోపు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించాలని స్పష్టం చేసింది. అలాగే మార్చి 5 నుంచి 10 వరకు నూతన ఓటర్ల సంపర్క్ అభియాన్​ను చేపట్టనుంది. రాష్ట్రప్రభుత్వం సర్పంచ్‌ ఎన్నికలు ఎందుకు జరపడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో గెలిచిందన్నారు.

పది సీట్లే టార్గెట్​ - నిత్యం జనంలో ఉండేలా రథయాత్రలు - బీజేపీ లోక్​సభ ఎన్నికల ప్లాన్ ఇదే

DK Aruna Fires On Congress : కాంగ్రెస్‌ పార్టీకి ఆ విషయం తెలిసే సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు. 17 ఎంపీలను గెలిపిస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి పార్లమెంట్‌ ఎన్నికలకు ముడి పెట్టడం ఏంటని డీకే అరుణ నిలదీశారు. రాష్ట్రానికి ఆరు గ్యారెంటీలు కాదు, మోదీ గ్యారెంటీతోనే భవిష్యత్‌ ఉంటుందనే నినాదంతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లనుంది.

"పార్లమెంటు ఎన్నికలకు, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధం ఏమిటి? రాష్ట్రంలో సర్పంచ్​ ఎలక్షన్​ ఎందుకు నిర్వహించడం లేదు. బీఆర్ఎస్​పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్​ పార్టీ గెలిచింది. దీంతో కావాలనే సర్పంచ్​ ఎన్నికలు నిర్వహించడం లేదు. 17 ఎంపీలను గెలిపిస్తేనే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని చెప్పడం సరికాదు. ఆరు గ్యారంటీలు అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి పార్లమెంట్​ ఎన్నికలకు ముడి పెట్టడం సరికాదు."-డి.కె.అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

విపక్షాలు పెట్టుకున్న కూటమి అప్పుడే విచ్చిన్నం అవుతోంది : కిషన్​రెడ్డి

లోక్​సభ ఎన్నికల్లో 10 సీట్లే లక్ష్యంగా 'బీజేపీ క్లస్టర్ సమావేశాలు'

ABOUT THE AUTHOR

...view details