RCB vs KKR IPL 2024:2024 ఐపీఎల్లో నేడు (మార్చి 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. అయితే ఐపీఎల్లో ఆర్సీబీ- కేకేఆర్ ఫైట్‌ను ఫ్యాన్స్ హై వోల్టెజ్ మ్యాచ్‌లా భావిస్తారు. గతంలో పలుమార్లు గంభీర్- విరాట్ మధ్య జరిగిన వివాదాలే ఇందుకు కారణం. అందుకే ఈ మ్యాచ్‌ను ఆర్సీబీ- కేకేఆర్లా కాకుండా గంభీర్- విరాట్ మధ్య ఫైట్లా భావిస్తారు.
ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌కు సంబంధించి మీమ్స్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. ఐపీఎల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ జియో సినిమా సైతం ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. దీంతో ఇరుజట్ల అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫైట్‌లో కావాల్సినంత డ్రామా, యాక్షన్ ఉంటుందని, దీంతో ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 గేమ్‌లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించింది. విరాట్, దినేశ్ కార్తిక్ ఫామ్‌లోకి రావడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. మరోవైపు కోల్‌కతా కూడా పటిష్ఠంగానే ఉంది.
ఇక ఈ ప్లేయర్ల మధ్య ఫైట్ చూడాల్సిందే!
- సునీల్ నరైన్- విరాట్ కోహ్లీ:గతంలో ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్‌లో విరాట్ vs నరైన్ ఫైట్ ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇప్పటిదాకా ఐపీఎల్లో విరాట్‌ను నరైన్ నాలుగుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీంతో మరోసారి విరాట్‌ను ఔట్ చేసేందుకు నరైన్ ప్లాన్ చేస్తుంటే, ఈ కరీబియన్ బౌలింగ్‌ను చిత్తు చేయాలని విరాట్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
- అల్జారి జోసెఫ్- శ్రేయస్ అయ్యర్:కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను పేస్ బౌలింగ్‌తో దెబ్బ కొట్టేందుకు ఆర్సీబీ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం వెస్టిండీస్ పేసర్ అల్జారి జోసెఫ్‌తో స్ట్రాటజీ ప్లాన్ చేస్తోంది. తొలిసారి ఆర్సీబీ జట్టులో ఆడతున్న జోసెఫ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో మరి.
- స్టార్క్ వర్సెస్ డుప్లెసిస్:ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత కాస్ట్లీ ప్లేయర్ మిచెల్ స్టార్క్. ఈ పేసర్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ సిద్ధమవుతున్నాడు. ఈ ఇద్దరు ఫారిన్ ప్లేయర్ల మధ్య ఫైట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.