తెలంగాణ

telangana

'అలా ఎలా చేశావయ్యా' - హర్షిత్ రానా చేసిన పనికి గంభీర్ రియాక్షన్! - IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 7:43 AM IST

KKR VS DC IPL 2024 : ఐపీఎల్​ 2024లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 29) కోల్​కతా నైటర్స్​, దిల్లీ క్యాపిటల్స్​, మధ్య జరిగిన మ్యాచ్​లో కోల్​కతా ప్లేయర్ హర్షిత్ రానా చేసిన ఓ తప్పిదం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

HARSHIT RANA IPL
KKR VS DC IPL 2024

KKR VS DC IPL 2024 :ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఏకపక్షంగా పోరు సాగింది. ఇందులో దిల్లీ బ్యాటర్లు తేలిపోగా, 7 వికెట్ల తేడాతో ఆ జట్టును కోల్​కతా చిత్తుగా ఓడించింది. 16.3 ఓవర్లలోనే 153 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. ఓ అయితే ఈ మ్యాచ్‌ జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు రేపుతోంది.

మ్యాచ్ మధ్యలో కోల్​కతా జట్టు ప్లేయర్ హర్షిత్ రాణా చేసిన ఆ తప్పిదం దిల్లీ క్యాపిటల్స్‌కు కలిసి వచ్చింది. దీంతో అభిమానులతో పాటు మాజీలు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్​కతా ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ అతడు చేసిన పనిపైనే ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

అలా ఎలా చేశావయ్యా?
తొలుత బ్యాటింగ్​కు దిగిని దిల్లీ జట్టు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నంచినప్పటికీ ఏ మాత్రం వేగం పుంజుకోలేకోపయింది. ఆచీతూచీ ఆడుతూ 153 పరుగుల వరకు నెట్టుకొచ్చింది. అయితే కోల్​కతా ప్లేయర్ వరుణ్ చక్రవర్తీ వేసిన 9వ ఓవర్‌లో ఓ అనూహ్యమైన ఘటన జరిగింది. ఈ ఓవర్ ఫస్ట్ బాల్​ను చక్రవర్తీ లెంగ్త్‌లో వేయగా, దాన్ని రిషభ్ పంత్ స్వీప్ షాట్​గా ఆడాడు.

అయితే ఆ బాల్​ మిస్ టైమ్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తాకింది. దీంతో ఓవర్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. సరిగ్గా అదే సమయంలో షార్ట్ థర్డ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోల్​కతా ప్లేయర్ హర్షిత్ రాణా కుడివైపు జరిగి క్యాచ్ అందుకునేందుకు ముందుకొచ్చాడు. కానీ ఈజీగా పట్టగలిలే క్యాచ్​ను అతడు వదిలేశాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.

అంత ఈజీ క్యాచ్​ను ఎలా వదిలేశాడు అంటూ నివ్వెరపోయారు. డగౌట్​లో ఉన్న గౌతమ్ గంభీర్ కూడా అవాకయ్యాడు. వరుణ్ చక్రవర్తీ కూడా ఏం అనలేక అలా చూస్తూనే ఉండిపోయాడు. ఆ క్యాచ్ మాత్రం వదలకపోయుంటే పంత్ 18 పరుగులకే పెవిలియన్ బాట పట్టేవాడు.

ఇక ఇదే అదునుగా చేసుకుని చెలరేగిన పంత్ వైభవ్ అరోరా వేసిన మరుసటి ఓవర్‌లో రెండు బౌండరీలు బాదాడు. కానీ వరుణ్ చక్రవర్తీ తన మరుసటి ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా పంత్​కు క్యాట్ ఔట్​ చేశాడు. దాంతో హర్షిత్ రాణా కాస్త ఊరట చెందాడు. ఇక పంత్ వికెట్‌తో దిల్లీ జట్టు 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

వింటేజ్ పంత్​ ఈజ్​ బ్యాక్​ - ధోనీ హెలికాప్టర్ షాట్​తో విమర్శకులకు పంచ్​ - IPL 2024

సాల్ట్ హాఫ్ సెంచరీ - దిల్లీ క్యాపిటల్స్​పై కోల్​కతా విజయం - IPL 2024

ABOUT THE AUTHOR

...view details