తెలంగాణ

telangana

IPL​పై పాక్ క్రికెటర్ విమర్శలు- తిప్పికొడుతున్న నెటిజన్లు - Junaid Khan On IPL

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 7:56 PM IST

Updated : Apr 4, 2024, 9:12 PM IST

Junaid Khan On IPL: క్రికెట్​లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన డొమెస్టిక్ లీగ్ ఐపీఎల్​పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ విమర్శలు చేశారు. గత వారం రోజుల్లో జునైద్ ఐపీఎల్ గురించి మాట్లాడటం ఇది రెండోసారి కావడం విశేషం.

junaid khan on ipl
junaid khan on ipl

Junaid Khan On IPL: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జునైద్ ఖాన్ మరోసారి ఐపీఎల్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఇటీవల హైదరాబాద్ వేదికగా ముంబయి ఇండియన్స్​పై సన్​రైజర్స్​ రికార్డు స్థాయి స్కోర్ సాధించడం పట్ల జునైద్ అసహనం వ్యక్తం చేస్తూ ఎక్స్ (ట్విట్టర్​)లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. 'ఐపీఎల్​లో ఫ్లాట్ పిచ్​లు, చిన్న బౌండరీలు ఉంటాయి. 278 టార్గెట్' అంటూ రాసుకొచ్చాడు.

కాగా, తాజాగా కోల్​కతా నైట్​రైడర్స్ బ్యాటర్ సునీల్ నరైన్ దిల్లీపై ఆడిన ఇన్నింగ్స్​ గురించి కూడా కామెంట్ చేశాడు.'ఐపీఎల్​లో ఫ్లాట్ పిచ్​లు ఉంటాయి. ఈ పిచ్​​లపై బ్యాటింగ్ చేయడం చాలా సులభం. ఇంటర్నేషనల్ టీ20ల్లో 155 పరుగులు చేసిన నరైన్ ఈరోజు ఓపెనర్​గా వచ్చి 85 స్కోర్ చేశాడు' అని తాజా ట్వీట్​లో రాశాడు. దీంతో నెటిజన్లు జునైద్​పై ఫైర్ అవుతున్నారు. 'భారత్​లో ఫ్లాట్ పిచ్​లైతే 2023 వన్డే వరల్డ్​కప్​లో మీ జట్టు ఎందుకు బాగా ఆడలేకపోయింది' అంటూ చురకలు అంటిస్తున్నారు.

కాగా, బుధవారం దిల్లీ క్యాపిటల్స్​తో విశాఖపట్టణం వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనింగ్ బ్యాటర్​గా వచ్చిన నరైన్ 39 బంతుల్లోనే 85 పరుగులు నమోదు చేసి ఔరా అనిపించాడు. అందులో 7 ఫోర్లు, 7 సిక్స్​లు ఉన్నాయి. ఈ లెక్కన 70 పరుగులు బౌండరీల ద్వారా వచ్చినవే. నరైన్​తోపాటు యంగ్ బ్యాటర్ రఘువంశీ (54), ఆండ్రూ రస్సెల్ (41), రింకు సింగ్ (26) కూడా రెచ్చిపోవడం వల్ల కేకేఆర్​కు భారీ స్కోర్ దక్కింది. 20 ఓవర్లలో కేకేఆర్ 272 పరుగులు చేసి, ప్రత్యర్థి ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతంరం ఛేదనలో దిల్లీ తేలిపోయింది. 17.2 ఓవర్లలోనే 166 పరుగులకు కుప్పకూలింది. దిల్లీలో కెప్టెన్ రిషభ్ పంత్ ఒక్కడే హాఫ్ సెంచరీ (55)తో మెరిశాడు.

ఇక గతవారం హైదరాబాద్ వేదికగా ముంబయి- సన్​రైజర్స్​ మ్యాచ్​లో కూడా పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ ఐపీఎల్​ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. అనంతరం ముంబయి కూడా ఛేదనలో దూకుడుగానే ఆడింది. 20 ఓవర్లలో ముంబయి 246కే పరిమితమై 31 పరుగుల తేడాతో ఓడింది.

విశాఖ మ్యాచ్​ - దిల్లీ క్యాపిటల్స్​పై కోల్​కతా భారీ విజయం - KKR VS DC IPL 2024

గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టిన సునీల్ - 7 ఫోర్లు 7 సిక్స్​లతో విశాఖలో వీరబాదుడు - IPL 2024 DC VS KKR

Last Updated :Apr 4, 2024, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details