తెలంగాణ

telangana

పంజాబ్ సీఎస్కే మ్యాచ్​ - నమోదైన 5 రికార్డులివే! - IPL 2024

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 10:55 AM IST

IPL 2024 PBKS VS CSK Records : పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ 28 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డ్​తో పాటు మరిన్ని రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే?

The Associated Press
IPL 2024 PBKS VS CSK Records (The Associated Press)

IPL 2024 PBKS VS CSK Records :పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​ 28 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లో రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డ్​తో పాటు మరిన్ని రికార్డులు నమోదయ్యాయి.

పంజాబ్‌ కింగ్స్​పై చెన్నై సూపర్ కింగ్స్​ దాదాపు మూడేళ్ల తర్వాత విజయం సాధించింది. 2021 సీజన్‌లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పుడు 28 పరుగులు తేడాతో గెలిచింది.

ఒక ఐపీఎల్‌ మ్యాచులో అత్యధిక సార్లు 40+ స్కోరు, మూడు వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్​గా నిలిచాడు రవీంద్ర జడేజా. దీంతో షేన్‌ వాట్సన్ (3), యువరాజ్‌ సింగ్‌ (3) సరసన నిలిచాడు. వీరి తర్వాత ఆండ్రి రస్సెల్ (2) కొనసాగుతున్నాడు.

పంజాబ్‌ కింగ్స్​ హోంగ్రౌండ్స్​లో ఘోరంగా ఫెయిల్ అయింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచుల్లోనూ ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. గతేడాది కూడా ఏడు మ్యాచుల్లోనూ ఒక్కటి మాత్రమే గెలిచి ఆరు ఓటములను మూటగట్టుకుంది.

ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఇరు జట్ల వికెట్‌ కీపర్లు డకౌట్‌ అవ్వడం ఇది ఐదో సారి. సీఎస్కే తరఫున ధోనీ, పంజాబ్‌ ప్లేయర్​ జితేశ్‌ శర్మ సున్నాకే ఔట్ అయ్యారు. అంతకుముందు ఆర్​ఆర్​-ఎంఐ (2010), ఎంఐ - ఆర్​ఆర్​ (2012), ఎంఐ -సన్​రైజర్స్​ (2018), గుజరాత్ టైటాన్స్​- దిల్లీ క్యాపిటల్స్​ (2023) మ్యాచుల్లో ఇలా జరిగింది.

సీఎస్కే స్టార్‌ ఆల్‌ రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్​లో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు. ఐపీఎల్‌ హిస్టరీలో సీఎస్కే తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​లు అందుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు మహీ 15 సార్లు ఈ అవార్డును అందుకోగా జడేజా 16వ దక్కించుకున్నాడు. వీరిద్దరి తర్వాత సురేశ్‌ రైనా (12), రుతురాజ్‌ గైక్వాడ్ (11), మైక్‌ హస్సీ (10) వరుసగా ఉన్నారు.

'ధోనీ అలా చేయడం కరెక్ట్ కాదు!' Source ANI - IPL 2024 Dhoni

జడేజా ఆల్​రౌండ్​ షో- 28 పరుగుల తేడాతో చెన్నై విజయం - IPL 2024

ABOUT THE AUTHOR

...view details