తెలంగాణ

telangana

'టీ20ల్లో బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అదే' - IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 6:40 PM IST

IPL 2024 CSK Bowling Coach DJ Bravo : బౌలర్ల ఎదుర్కొనే సమస్య గురించి మాట్లాడాడు చెన్నై బౌలింగ్‌ కోచ్​ బ్రావో. అలానే తమ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లు, ఇష్టమైన పేసర్లు, టీ20ల్లో యార్కర్ల ప్రాముఖ్యత వంటి విషయాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాలు స్టోరీలో

.
.

IPL 2024 CSK Bowling Coach DJ Bravo : బౌలర్ల ఎదుర్కొనే సమస్య గురించి మాట్లాడాడు చెన్నై బౌలింగ్‌ కోచ్​ బ్రావో. అలానే తమ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌లు, ఇష్టమైన పేసర్లు, టీ20ల్లో యార్కర్ల ప్రాముఖ్యత వంటి విషయాల గురించి కూడా మాట్లాడాడు.

"పేసర్‌కు యార్కర్ అత్యంత ముఖ్యమైన డెలివరీ. అది లేకుండా ఎక్కువ కాలం సక్సెస్‌ కాలేరు. T20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ, మతీషా పతిరానా చాలా మంది క్రమం తప్పకుండా యార్కర్లు వేస్తారు. వేరియేషన్లు చూపుతారు. ఈ ఫార్మాట్‌లో బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే - బౌలర్లు తమ యార్కర్ల బౌలింగ్​ సామర్థ్యాన్ని విశ్వసించరు. అందుకే నేను కోచింగ్ సెషన్‌లలో ఒకటి పాటిస్తా. ప్రతి ఒక్క బౌలర్ సెషన్‌లో 12-14 యార్కర్లు వేయాలి. ఈ స్థాయిలో ప్రాక్టీస్‌ చేస్తేనే మ్యాచ్‌లో యార్కర్లు వేయడం సులభం అవుతుంది." అని చెప్పాడు.

  • అభిమాన పేసర్లు -CSKలో తన అభిమాన పేసర్ల గురించి చెబుతూ పతిరానాను ప్రశంసించాడు బ్రావో. పతిరానా తన స్లింగి, మలింగ లాంటి యాక్షన్‌తో పాపులర్‌ అయ్యాడు. గత సీజన్‌లో CSK తరఫున 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. ప్రస్తుత సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు సాధించాడు. పతిరానా చాలా ప్రత్యేకమైనవాడు. నేను అతన్ని బేబీ మలింగ అని పిలుస్తాను. బేబీ గోట్ అని కూడా పిలుస్తాను. అతనికి సహజమైన సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయి. అతనికి ప్రత్యేకంగా కోచింగ్‌ చేయాల్సింది లేదు. అని బ్రావో చెప్పాడు. బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ కూడా ఇష్టమని పేర్కన్నాడు బ్రావో. ముస్తాఫిజుర్‌ ఈ ఐపీఎల్‌లో ఆరు మ్యాచ్‌లలో 11 వికెట్లు తీశాడు. పేసర్ తుషార్ పాండేని కూడా బ్రావో ప్రశంసించాడు. IPL 2023లో అతను 16 గేమ్‌లలో 21 వికెట్లు పడగొట్టి CSK ఐదో టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రస్తుతం చెన్నై నాలుగు విజయాలు, మూడు ఓటములతో మొత్తం ఎనిమిది పాయింట్లతో టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఇంకా ఈ సీజన్​లో చెన్నైతో పాటు లఖ్​నవూ కూడా విజయాల్లో సమానంగా ఉంది. అయితే రన్‌ రేట్‌ కారణంగా ఐదో స్థానానికి పరిమితం అయింది. ఈ రోజు మ్యాచ్‌లో మళ్లీ చెన్నైపై లఖ్‌నవూ పై చేయి సాధిస్తుందా? చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్లేఆఫ్స్ చేరాలంటే ముంబయి ఆ పని కచ్చితంగా చేయాల్సిందే! - IPL 2024

'ఆ విషయం గురించి ధోనీకి అప్పుడే చెప్పా' - దూబాయ్ రూమ్​ కాంట్రవర్సీపై రైనా క్లారిటీ! - Suresh Raina CSK

ABOUT THE AUTHOR

...view details