తెలంగాణ

telangana

477కు టీమ్ఇండియా ఆలౌట్‌ - ఆండర్సన్ 700 వికెట్ల రికార్డు

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 10:06 AM IST

Updated : Mar 9, 2024, 11:07 AM IST

India Vs England 5th Test : భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది. ప్రస్తుతం భారత జట్టు 259 పరుగులు ఆధిక్యంలో ఉంది.

India Vs England 5th Test
India Vs England 5th Test

India Vs England 5th Test :ధర్మశాల వేదికగా భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మూడో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో శుభ్​మన్​ గిల్​ (110), రోహిత్‌ శర్మ(103), దేవ్​దత్ పడిక్కల్​ (65), సర్ఫరాజ్‌ ఖాన్(56), యశస్వీ జైస్వాల్‌ (57) పరుగులు స్కోర్ చేశారు. ప్రస్తుతం భారత జట్టు 259 పరుగులు ఆధిక్యంలో ఉంది.

మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్‌ 5 వికెట్లు పడగొట్టగా, అండర్సన్‌ 2, హార్ట్‌లీ 2, స్టోక్స్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే (79) టాప్ స్కోరర్​గా విసిటాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో 29 పరుగులు చేసి సెకెండ్ హైయ్యెస్ట్​గా నిలిచాడు. టీమ్ఇండియా బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ ఐదు , రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించారు.

India Vs England 5th Test : ఓవర్‌నైట్ స్కోరు 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన రోహిత్​ సేన నిన్నటి స్కోర్​కు మరో నాలుగు పరుగులను మాత్రమే జోడించగలిగింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కుల్‌దీప్ యాదవ్​ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా కూడా పెవిలియన్ బాట పట్టాడు.

ఆండర్సన్ 700 వికెట్ల రికార్డు :
James Anderson 700 Wickets : ఇక ఇదే వేదికగా ఇంగ్లాండ్ జట్టు బౌలర్‌ జేమ్స్​ అండర్సన్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ప్లేయర్​గా రికార్డుకెక్కాడు. 187 టెస్టుల్లో అతడు ఈ రికార్డును సాధించాడు. ఇలాంటి అరుదైన ఘనతను అందుకున్న ఏకైక ఫాస్ట్‌ బౌలర్​గా రికార్డుకెక్కాడు. ఇక టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గానూ అండర్సన్‌ స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఆ జాబితాలో 800 వికెట్లతో తొలి స్థానంలో మురళీధరన్‌, రెండో స్థానంలో షేన్‌ వార్న్‌(708) ఉన్నారు.

ఆ మూడు రికార్డులపై ఫోకస్​ - 41 ఏళ్ల వయసులోనూ జేమ్స్ సూపర్ ఫామ్​

రెండో టెస్టుతో ఆండర్సన్‌ ఎంట్రీ - అప్పటికి ఆ ఇద్దరు పుట్టనేలేదు

Last Updated : Mar 9, 2024, 11:07 AM IST

ABOUT THE AUTHOR

...view details