తెలంగాణ

telangana

ఉత్కంఠ పోరులో ముంబయిపై టైటాన్స్‌ విజయం - GT VS MI IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 10:59 PM IST

Updated : Mar 25, 2024, 6:21 AM IST

GT VS MI IPL 2024 : సూపర్ సండేలో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్​ - గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠగా​ జరిగింది. ఈ పోరులో అంచనాలను తారుమారు చేసి ముంబయిపై గుజరాత్ గెలిచింది.

GT VS MI IPL 2024
GT VS MI IPL 2024

GT VS MI IPL 2024 : సూపర్ సండేలో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్​ - గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్​లో గెలిచి గుజరాత్‌ టైటాన్స్‌ బోణీ కొట్టింది. 6 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై గెలిచింది. వాస్తవానికి 169 పరుగుల ఛేదనలో ముంబయి ఇండియన్స్‌ 12 ఓవర్లలో 107/2 స్కోరు చేసింది. క్రీజులో నిలదొక్కుకుని దూకుడుగా రోహిత్‌, బ్రెవిస్‌ ఉండడంతో గెలుపు ఆ జట్టుదే అని అంతా అనుకున్నారు. కానీ అనంతరం అద్భుతంగా పుంజుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబయికి కళ్లెం వేసి టోర్నీలో శుభారంభం చేసింది. బంతితో బుమ్రా చేసిన మ్యాజిక్​ వృథా అయింది.

మ్యాచ్ సాగిందిలా: బుమ్రా (3/14) అద్భుతంగా బౌలింగ్‌ చేయడం వల్ల మొదట టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 168/6 స్కోరుకే పరిమితమైంది. సాయి సుదర్శన్‌ (39 బంతుల్లో 3×4, 1×6 సాయంతో 45 పరుగులు) టాప్‌ స్కోరర్​గా నిలిటాడు. శుభ్‌మన్‌ గిల్‌ (22 బంతుల్లో 3×4, 1×6 సాయంతో 31 పరుగులు) చేశాడు. రాహుల్ తెవాటియా (22), వృద్ధీమాన్‌ సాహా (19), ఒమర్‌జాయ్ (17), మిల్లర్‌ (12) పరుగులు చేశారు. ఇంకా ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాతో 3 పాటు గెరాల్డ్ కొయెట్జీ 2, పీయూష్‌ చావ్లా ఒక వికెట్ పడగొట్టారు.

ఛేదనలో ముంబయి ఇండియన్స్​ 9 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది. రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 7×4, 1×6 సాయంతో 43 పరుగులు), బ్రెవిస్‌ (38 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 46 పరుగులు) బాగానే రాణించారు. దీంతో ఓ దశలో ముంబయి గెలిచేలా కనిపించింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా దెబ్బతింది. దూకుడు ప్రదర్శనతో అర్థ సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో రోహిత్​ వెనుతిరిగాడు. సాయి కిశోర్ బౌలింగ్​లో ఔటై పెవిలియన్ బాట పట్టాడు. ఇషాన్ కిషన్​ ఒక్క రన్ కూడా చేయకుండానే ఔటయ్యాడు. అజ్మతుల్లా (2/27), మోహిత్‌ శర్మ (2/32), స్పెన్సర్‌ జాన్సన్‌ (2/25), ఉమేశ్‌ (2/31) ముంబయి జట్టు దూకుడు ప్రదర్శనకు కళ్లెం వేశారు.

ముంబయి ఇండియన్స్ జట్టు : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ గోపాల్ విష్ణు వినోద్, షామ్స్ ములాని, రొమారియో షెపర్డ్, అర్జున్ తెందూడూల్కర్, కుమార్ కార్తికేయ, శివలిక్ శర్మ, అన్షుల్ కాంబోజ్, ఆకాష్ మధ్వల్, నువాన్ తుషార, డెవాల్డ్ బ్రీవిస్, క్వేనా మఫాకా, నమన్ ధీర్

గుజరాత్ టైటాన్స్ జట్టు : శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వాడే, జయంత్ యాదవ్, సందీప్ వారియర్, షారుక్ ఖాన్, అభినవ్ మనోహర్, శరత్ బీఆర్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, దర్శన్ నల్కండే, కార్తీక్ త్యాగి, స్పెన్సర్ జాన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సుశాంత్ మిశ్రా

రాజస్థాన్​దే పైచేయి - సూపర్ సండేలో తొలి విక్టరీ నమోదు - LSG VS RR IPL 2024

ఎందుకంత ఓవరాక్షన్ బ్రో - కోల్​కతా స్టార్​కు భారీ జరిమానా - IPL 2024 SRH Vs KKR

Last Updated : Mar 25, 2024, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details