తెలంగాణ

telangana

T20 వరల్డ్​కప్:​ విరాట్​కు లైన్ క్లియర్!- అగార్కర్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ - Ajit Agarkar On Virat Kohli

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 7:50 PM IST

Ajit Agarkar On Virat Kohli:టీ20 వరల్డ్ కప్‌ టీమ్‌కి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా సెలక్ట్‌ అవుతాడని అగార్కర్‌ వ్యాఖ్యలు చెబుతున్నాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో సెలక్షన్‌ కమిటీ చేసిన వ్యాఖ్యలు కోహ్లి ఫ్యాన్స్‌లో ఫుల్‌ జోష్‌ నింపాయి. అగార్కర్‌ ఏమన్నాడంటే?

Ajit Agarkar On Virat Kohli
Ajit Agarkar On Virat Kohli

Ajit Agarkar On Virat Kohli:2024 టీ20 వరల్డ్​కప్​ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. దీంతో ఆయా దేశాలు జట్ల ఎంపికపై కసకత్తులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా జట్టు ఎంపికపై కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి టీమ్‌లో అవకాశం దక్కుతుందా? లేదా? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. తన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అరంగేట్రం నుంచి కోహ్లి ఇండియా తరఫున ఒక్క ఐసీసీ టోర్నమెంట్‌ కూడా కోల్పోలేదు.

దాదాపు అన్ని ఐసీసీ టోర్నీల్లో విరాట్ అద్భుతంగా రాణించాడు. కానీ, మొదటిసారి కోహ్లీ ఎంపిక ప్రశ్నార్థకంగా మారింది. అయితే 2022 నవంబర్ నుంచి కోహ్లీ కేవలం రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్​లు ఆడాడు. దీంతో కోహ్లీకి రానున్న పొట్టి ప్రపంచకప్​లో స్థానం కష్టమేనని జోరుగా ప్రచారం సాగింది. కానీ ప్రస్తుత ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున అదరగొడుతున్న విరాట్ కచ్చితంగా టీ20 జట్టుకు ఎంపికవుతాడని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ఏప్రిల్ చివరి లేదా మే తొలి వారంలో ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలో విరాట్ ఎంపిక దాదాపు ఖాయమని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్ అగార్కర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అగార్కర్​ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో విరాట్ గురించి చేసిన కామెంట్లు ఫ్యాన్స్‌కి భరోసా ఇస్తున్నాయి. 'విరాట్‌ ఫిట్‌నెస్‌ అద్భుతం. కోహ్లీ తన కెరీర్ మొత్తంలో ఫిట్‌నెస్‌కు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు. అతను చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు. ఇప్పుడు దాని రిజల్ట్స్‌ చూస్తున్నాం' అని చెప్పాడు.

స్ట్రైక్‌రేట్‌పై చర్చలు!
మొదటి నుంచి టీ20లలో విరాట్ స్ట్రైక్‌ రేట్​పై ఆరోపణలు వచ్చాయి. అతడిని టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయకూడదనేందుకు దీన్నొక కారణంగా చూపారు. అయితే ప్రస్తుత ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ తరఫున కోహ్లి అత్యధిక పరుగులు చేశాడు. అతడే ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌. ఐదు మ్యాచ్‌లలో 105 యావరేజ్‌తో, 146 స్ట్రైక్ రేట్‌తో 316 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.

అయితే ఈ సెంచరీ 67 బంతుల్లో చేశాడు. ఐపీఎల్‌లో ఇది స్లోయెస్ట్‌ సెంచరీ కావడం వల్ల, మరోసారి అతడి స్ట్రైక్‌ రేట్​పై చర్చలు మొదలయ్యాయి. అయితే, ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కోహ్లీ స్ట్రైక్‌ రేటు 146. అత్యధిక స్ట్రైక్‌ రేటుతో బ్యాటింగ్‌ చేసి లిస్టులో 12వ ఆటగాడు. సీజన్‌ ప్రారంభంలో మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, కెవిన్ పీటర్సన్ టీ20 జట్టులో కోహ్లీ స్థానంపై ప్రశ్నించడంతో వివాదం తీవ్రమైంది. అనంతరం కోహ్లీ అద్భుతంగా రాణించడం వల్ల ఇప్పుడు అనుకూల స్వరాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అత్యధిక పరుగులే కాదు - ఆ రికార్డులోనూ విరాట్​కు తిరుగేలేదు! - Virat Kohli RCB

ఒక్కసారి హెయిర్​కట్​కు విరాట్ అంత ఖర్చు చేస్తాడా? - Virat Kohli Hairstyle Cost

ABOUT THE AUTHOR

...view details