తెలంగాణ

telangana

ఈ ఏడాది వరూథిని ఏకాదశి ఎప్పుడొచ్చింది? - ప్రాముఖ్యత, ఆచరించాల్సిన నియమాలు ఇవే! - Varuthini Ekadashi 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 12:04 PM IST

Varuthini Ekadashi 2024 Date : హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి వాటిలో ఒకటి.. వరూథిని ఏకాదిశి. అసలేంటి.. ఈ వరూథిని ఏకాదశి? ఈ ఏడాది ఎప్పుడొచ్చింది? దాని ప్రాముఖ్యత, ఆచరించాల్సిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Varuthini Ekadashi 2024 Date
Varuthini Ekadashi 2024

Varuthini Ekadashi 2024 Importance : ప్రత్యేకంగా చేసుకునే పండగల మాట అటుంచితే ప్రతి ఏకాదశిని పర్వదినంగా భావించే సంప్రదాయం హిందువులలో ఉంది. మిగిలిన రోజులతో పోల్చితే ఈ తిథిని ఉత్తమంగా భావిస్తారు. ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. కాబట్టి.. ఈ రోజు విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందంటున్నారు పండితులు. అయితే, ప్రతి నెలా శుక్ల పక్షంలో ఓ ఏకాదశి.. కృష్ణ పక్షంలో మరో ఏకాదశి వస్తుంది. ఇలా వచ్చే ఏకాదశుల్లో కొన్నింటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిల్లో 'వరూథిని ఏకాదశి'(Varuthini Ekadashi) ఒకటిగా చెప్పుకోవచ్చంటున్నారు పండితులు. అసలేంటి.. ఈ వరూథిని ఏకాదశి? ఈ సంవత్సరం ఎప్పుడొచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఎలాంటి నియమాలు ఆచరించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూథిని ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే బరుతని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువు వామనావతారాన్ని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువు(Lord Vishnu) అనుగ్రహం పొందేందుకు ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అంతేకాదు.. వరూథిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం, దానధర్మాలు చేయడం వల్ల గొప్ప విశేష ఫలితాలు వస్తాయంటున్నారు పండితులు.

వరూథిని ఏకాదశి ఎప్పుడొచ్చిందంటే..?ఈ ఏడాది 2024లో వరూథిని ఏకాదశి మే 4న శనివారం రోజు వచ్చింది. అంటే.. ఏకాదశి తిథి మే 3నాడు శుక్రవారం రాత్రి 11 గంటల 24 నిమిషాల నుంచి 4వ తేదీ రాత్రి 8 గంటల 28 గంటల వరకు ఉంది. కాబట్టి, మే 4వ తేదీ రోజు వరూథిని ఏకాదశిని జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఆచారాల ప్రకారం.. మహావిష్ణువు ఐదో అవతారమైన వామనుని పూజించిన వారికి భయం నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే! - vastu tips for home

ప్రాముఖ్యత ఏంటంటే? :పురాణాల ప్రకారం.. పరమశివుడు బ్రహ్మ ఐదో తలని తొలగించినప్పుడు శాపానికి గురవుతాడు. అప్పుడు శివుడు ఈ శాపం నుంచి విముక్తి పొందేందుకు వరూథిని ఏకాదశి నాడు ఉపవాస వత్రం చేపడతాడు. అలా శివుడు ఉపవాసం ఆచరించడం వల్ల శాప, పాపాల నుంచి విముక్తి పొందినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు.. మత విశ్వాసాల ప్రకారం వరూథిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అనేక సంవత్సరాలు తపస్సు చేసిన దానితో సమానంగా భావిస్తారు.

ఇకపోతే ఈ పవిత్రమైన రోజు తులసిని కూడా ఆరాధిస్తారు. అలాగే.. ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లో తులసి ఆకులు తెంపకూడదు. తులసి చెట్టు ముందు నెయ్యితో దీపం పెట్టాలి. అదే విధంగా తులసి మొక్క వేరులోని తడి మట్టిని కొద్దిగా తీసుకుని నుదుటిపై బొట్టుగా రాసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు.. ఇంటికి శ్రేయస్సు తీసుకొస్తుందని భక్తులు నమ్ముతారని పండితులు చెబుతున్నారు.

ఈరోజు ఆచరించాల్సిన నియమాలు :

  • ఈ పవిత్రమైన రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పవిత్ర నది స్నానం చేయాలి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకి అభిషేకం చేసి పాలు, తులసి సమర్పించాలి.
  • అలాగే వరూథిని ఏకాదశి రోజు జంతువులు, పక్షలకు నీరు, ఆహారం అందజేయడం మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. అదేవిధంగా మీ శక్తి మేరకు ఆహారం, బట్టలు దానం చేయడం చాలా శుభప్రదమైన ఫలితాలను ఇస్తోందంటున్నారు.
  • ఇక ఈ పవిత్రమైన రోజు పండ్లు దానం చేయడం వల్ల పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని చెబుతున్నారు పండితులు. అదేవిధంగా.. పూజా సమయంలో విష్ణుమూర్తికి బంతి పూలు సమర్పించాలని చెబుతున్నారు.

పూజ గదిలో దేవుడి ఫొటోలు లిమిట్​లో ఉండాల్సిందే! ఈవెనింగ్ దీపం కంపల్సరీ! - Pooja Room Vastu Rules

ABOUT THE AUTHOR

...view details