తెలంగాణ

telangana

ఈ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో విజయమే- వ్యాపారంలోనూ మంచి లాభాలు! - Daily Horoscope In Telugu

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 4:17 AM IST

Horoscope Today May 12th 2024 : మే​ 12న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today May 12th 2024 : మే​ 12న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు శుభకరంగా, ప్రయోజకరంగా ఉంటుంది. కొన్ని రకాల సమస్యలు కారణంగా మానసికంగా చికాకుతో ఉంటారు. ఈ కారణంగా దృఢ నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రయాణ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఎటు చూసినా వ్యతిరేక ఫలితాలే ఉన్నందున మౌనంగా, ప్రశాంతంగా ఉండటం మంచిది. గందరగోళం, నిర్ణయాల్లో అనిశ్చితి కారణంగా మంచి అవకాశాలను కోల్పోవచ్చు. రాజీపూర్వక ధోరణి, సర్దుకుపోయే తత్వం కలిగి ఉండేందుకు ప్రయత్నించండి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మేలు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే మేలు జరుగుతుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్ధికపరంగా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మేలు. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తే మంచిది. ఉద్యోగులకు పదోన్నతి, జీతం పెరుగుదల ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం బాగోలేనందున అయోమయం, సందిగ్ధంతో ఉంటారు. అదృష్టం ఈ రోజు మీతో దాగుడుమూతలు ఆడుతుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే కుటుంబ సభ్యులతో వాదనలు, అపార్ధాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో అశాంతి కారణంగా నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. కుటుంబ అవసరాల కోసం డబ్బును పొదుపు చేస్తే మంచిది. ఆరోగ్యం, ఆర్థిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా ఉండాలి. ఆంజనేయస్వామిని ప్రార్ధిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి సరదాగా విహార యాత్రలకు వెళతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలమైన సమయం. సుబ్రమణ్య స్వామి అష్టకం చదువుకుంటే శుభం జరుగుతుంది.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి శుభసమయం. అన్ని రంగాల వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఖచ్చితంగా ఉంటుంది. జీతం పెరుగుదలకు కూడా అవకాశాలు ఉన్నాయి . మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. దైవబలం అండగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు శుభఫలితాలు ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్ రంగంలో ఉండేవారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు అందుకుంటారు. ఆర్ధిక పరమైన ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. కొత్త పనులు చేపట్టడానికి, ప్రణాళికలను అమలుపరచడానికి అద్భుతమైన రోజు. వృత్తిపరంగా బాధ్యతాయుతంగా ఉంటారు. సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తుంది. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అన్ని పనులు మీరు అనుకున్నట్టుగా సాగవు కాబట్టి కొత్త స్కీములు, కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహనం గండం ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్ధిక నష్టం సూచితం. అత్యుత్సాహాంతో తొందరపాటు పనులు చేయవద్దు. శత్రువులు పొంచి ఉన్నారు. హనుమాన్ దండకం చదివితే శత్రుజయం ఉంటుంది.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సరదాగా, ఉల్లాసంగా గడుస్తుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. సామాజిక సమావేశాలు, కార్యక్రమాల్లో విభిన్నమైన వ్యక్తులను కలుసుకుంటారు. ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో కలహాల కారణంగా ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు ఆర్థిక వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. శివునికి రుద్రాభిషేకం చేయించుకుంటే ఆపదలు తొలగుతాయి.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. అందుకే కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఈ రోజు మొత్తం అశాంతితో, ఆందోళనతో ఉంటారు. మిమ్మల్ని రెచ్చగొట్టే వ్యక్తులను పట్టించుకోకుండా ఉంటే మంచిది. ఆర్ధికంగా నష్టపోవచ్చు. దైవబలాన్ని నమ్మి ముందుకెళితే విజయం మీదే! శని శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల నిరాశగా ఉంటారు. ఏ పని చేయాలన్నా శక్తి, ఉత్సాహం కొరవడుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కలతకు గురి చేయవచ్చు. శాంతంగా ఉండండి. వాదనల్లోకి దిగవద్దు. వృత్తిపరంగా నష్టాలు ఉండవచ్చు. ఆందోళన తగ్గాలంటే ధ్యానంపై ఏకాగ్రత పెట్టండి. ఇష్ట దేవతారాధన చేస్తే మంచిది.

ABOUT THE AUTHOR

...view details