తెలంగాణ

telangana

ఆ రాశులవారికి ఈరోజు ఒత్తిడి తప్పదు- వివాదాలకు దూరంగా ఉండాల్సిందే!

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 7:07 AM IST

Horoscope Today March 10th 2024 : మార్చి 10న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 10th 2024
Horoscope Today March 10th 2024

Horoscope Today March 10th 2024 :మార్చి 10న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మీ స్నేహితులతో కలిసి గడపడానికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. బహుమతులు, కానుకలు వంటివి తీసుకునే అవకాశం ఉంది. మీ కొత్త స్నేహితుల పరిచయాలు రానున్న రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటాయి. ఏదైనా ఒక పర్యటక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంటుంది.

వృషభం (Taurus) :ఉద్యోగులకు ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. ప్రారంభించిన కొత్త పనుల్లో విజయం సాధిస్తారు. మీ పై అధికారులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. మిగిలిన పనులను పూర్తి చేస్తారు.

మిథునం (Gemini) :ఈ రోజు మీకు అంత అనుకూలంగా ఉండదు. శారీరకంగా, మానసికంగా కాస్త ఇబ్బంది పడతారు. ఈ సమస్యలకు మీ పిల్లలు కారణం కూడా కావచ్చు. మీరు మానసికంగా ఇబ్బంది పడితే ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించవద్దు.

కర్కాటకం (Cancer) :ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. చెడు ఆలోచనలను దూరంగా ఉంచితే మంచింది. ఈ రోజు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. మీ కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి.

సింహం (Leo) :ఈ రోజు మీ జీవితంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంటాయి. అయితే ఒత్తిడి లేనప్పుడే మీ సృజనాత్మకత వికసిస్తుంది.

కన్య (Virgo) : మీకు ఓ మిత్రుడు లక్కీగా దొరుకుతారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ముందు మీ సామర్ధ్యం, కఠిన శ్రమ ప్రశంసలందుకుంటుంది.

తుల (Libra) :మీ బాస్ కోపాన్ని మీరు చవి చూస్తారు. మీ తోటి ఉద్యోగులు కూడా మీకు ఇష్టం లేకుండానే సహకారం అందిస్తారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బిగినర్స్​కు ఇంటర్వ్యూల్లో విజయాలు కాస్త ఆలస్యమవుతాయి.

వృశ్చికం (Scorpio) :మాటల్లో జ్ఞానం, చేతల్లో నాయకత్వం- ఈ రోజు మీ తీరు ఇలానే ఉంటుంది. పని ప్రదేశంలో జీతం పెంపు లేదా ఆఫీసు పొజిషన్​కు సంబంధించిన శుభవార్త వింటారు. అకౌంటెంట్లు, ఫ్రాంచైజీలు ఈ రోజు చక్కటి లాభాలు అందుకుంటారు.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు మీ పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు మానసికంగా, శారీరకంగా బలహీనంగా, బద్దకంగా ఉన్నట్లు భావిస్తారు. మీరు ఏదో ఒక కొత్త పని చేయడం కోసం ప్రణాళిక చేసుకుంటే వాటిని అమలు చేయడానికి ఇదే మంచి సమయం.

మకరం (Capricorn) :ఈ రోజు మీకు అంతగా అనుకూలంగా ఉండదు. కుటుంబసభ్యులతో మనస్పర్థలు వచ్చే అవకాశాలున్నాయి. దానితో పాటు అనవసరమై ఖర్చులు మీ సమస్యలకు తోడవుతాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు తమ చదువులపై అంతగా ఆసక్తి చూపించారు.

కుంభం (Aquarius) : మీరు రోజంతా సంతోషంగా ఉంటారు. మీ తారాబలం బ్రహ్మాండంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులు నుంచి బహుమతులు అందుకునే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు.

మీనం (Pisces) :ఈ రోజు ఆస్తికి సంబంధించివ వ్యవహారాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వివాదాలు, మనస్పర్థలకు దూరంగా ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details