తెలంగాణ

telangana

లోక్‌సభ ఎన్నికలు 2024 - నాలుగు ఎంపీ స్థానాలు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 7:42 PM IST

Updated : Mar 8, 2024, 10:15 PM IST

Telangana Congress Lok Sabha Candidates First List 2024 : లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించగా, తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Lok Sabha Candidates First List 2024
Telangana Congress

Telangana Congress Lok Sabha Candidates First List 2024 :కాంగ్రెస్‌ పార్టీ 39 మందితో లోక్​సభ అభ్యర్థుల(Lok Sabha Polls 2024) మొదటి జాబితా ప్రకటించింది. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెంది నాలుగు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జహీరాబాద్‌ నుంచి సురేష్‌కుమార్‌ షెట్కర్‌, నల్గొండ నుంచి రఘువీర్‌ కుందూరు, మహబూబ్‌ నగర్‌ నుంచి వంశీచంద్‌ రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ల పేర్లను మొదటి జాబితాలో ప్రకటిచింది.

జహీరాబాద్‌ నుంచి సురేష్‌ కుమార్‌ షెట్కర్‌కు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు ఆయన పేరును అధిష్ఠానం ప్రకటించింది. అదేవిధంగా నల్గొండ నుంచి సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘవీర్‌కు అవకాశం కల్పించారు. ఏఐసీసీ కార్యదర్శి, మహబూబ్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తారని గతంలో కొస్గిలో జరిగిన సభలోనే వంశీచంద్‌ రెడ్డిని స్వయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డినే బహిరంగ సభలో ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌కు కూడా ఏఐసీసీ(AICC) ఇచ్చిన హామీ మేరకు ఆయనకు టికెట్ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

'రూ.210 కోట్లు ఫైన్​ తప్పదు- బ్యాంక్ అకౌంట్లు బ్లాక్​!'- కాంగ్రెస్​ బిగ్ షాక్

Lok Sabha Polls 2024 :రాష్ట్రంలో 17 లోక్​సభ స్థానాలకు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను ఆచితూచి ప్రకటిస్తోంది. అన్ని చోట్ల గెలుపు గుర్రాలనే బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్​ పార్టీకి 13 నుంచి 14 స్థానాలు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్​ అధినాయకత్వం భావించింది. అందులో భాగంగానే ఆ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి ఏ నేతలు వచ్చిన వెంటనే ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​ పార్లమెంటు(Hyderabad Lok Sabha Seat) పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు అధిష్ఠానం ఈ అంశంపై పూర్తి దృష్టి కేంద్రీకరించి, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పట్టుదలతో కనిపిస్తోంది.

లోక్​సభలో పోటీ చేసే 39 మందితో ఉన్న తొలి లిస్ట్​ జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ ప్రకటించారు. గురువారం సమావేశమైన కాంగ్రెస్​ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ పేర్లను ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాము ఎన్నికల మూడ్​లో ఉన్నామని దూకుడు పెంచుతామని స్పష్టం చేశారు. ఈ తొలి జాబితాలో ప్రకటించిన 39 మందిలో 15 మంది జనరల్‌, 24 మంది ఇతర కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

కాంగ్రెస్‌ CEC కీలక భేటీ- లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు- వర్చువల్​గా పాల్గొన్న రాహుల్

యంగ్​ ఓటర్లే టార్గెట్​గా కాంగ్రెస్​ మ్యానిఫెస్టో- యువతకు 'ఉపాధి హక్కు' హామీ

Last Updated : Mar 8, 2024, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details