తెలంగాణ

telangana

బీఆర్ఎస్​కు మరో షాక్!​ - 'కారు' దిగి కాంగ్రెస్​లో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్? - MLA PRAKASH GOUD WILL JOIN CONGRESS

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 11:55 AM IST

Updated : Apr 19, 2024, 12:03 PM IST

MLA Prakash Goud Join Congress : బీఆర్​ఎస్​ మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ ముఖ్యమంత్రిని కలిశారు. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్​లో చేరతానని సీఎంకు తెలిపినట్లు సమాచారం. లోక్​సభ ఎన్నికల ముందు ప్రకాశ్‌ గౌడ్‌ హస్తం పార్టీలో చేరడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

MLA Prakash Goud Join Congress
BRS MLA JOIN Congress

MLA Prakash Goud Join Congress: మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్​ను వీడనున్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు ఆయన తెలిపారు. నేడో, రేపో అనుచరులతో కలిసి చేరతానని చెప్పారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ప్రకాశ్‌ గౌడ్‌ సీఎంతో సమావేశమయ్యారు.

బీఆర్ఎస్​కు వరుస షాక్​లు - కాంగ్రెస్‌లో భారీ చేరికలు - హస్తంతో టచ్‌లో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు! - lok sabha elections 2024

BRS MLA JOIN Congress : రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకాశ్​ గౌడ్ తెలిపారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా చాలా మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని హస్తం నేతలు అంటున్నారు.

Last Updated : Apr 19, 2024, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details