తెలంగాణ

telangana

కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ - రైతులపై ఎందుకు లేదు? : హరీశ్‌రావు - BRS Party Meeting at Kamareddy

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 3:21 PM IST

Updated : Mar 31, 2024, 3:36 PM IST

Harish Rao Participate BRS Meeting at Kamareddy : కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో ఉన్న ప్రేమ, రైతులపై ఎందుకు లేదని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Harish Rao Participate BRS Meeting at Kamareddy
Harish Rao Participate BRS Meeting at Kamareddy

Harish Rao Participate BRS Meeting at Kamareddy : కామారెడ్డి ఎన్నికల్లో ఓటమి గతం గతః - రాబోయే ఎన్నికల్లో విజయం సాధిద్దామని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు. ఉద్యమకారుడు గాలి అనిల్‌ కుమార్​ను గెలిపించుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు (Six Guarantees) అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికల్లో (Lok Sabha Election 2024) కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. కామారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ డిసెంబరు 9న రూ.2 లక్షల రుణమాఫీ (Loan Waiver) చేస్తామని మాటిచ్చారు కానీ ఆ హామీ ఏం అయిందని ప్రశ్నించారు. అలాగే వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి, వర్షాకాలంలో ఇవ్వలేదు, పోనీ యాసంగికి అయినా ఇచ్చారా అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.500 బోనస్​ ఇస్తే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు, లేకుంటే కారు గుర్తుకే ఓటేస్తామని గ్రామాల్లో తీర్మానం చేయించండని కార్యకర్తలకు సూచించారు.

మూడు విచారణలు, ఆరు వేధింపులుగా కాంగ్రెస్‌ వంద రోజుల పాలన : హరీశ్‌రావు

Harishrao Fires on Congress : కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో ఉన్న ప్రేమ, రైతులపై ఎందుకు లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మైనార్టీలను కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు మోసం చేస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీ నాయకులను కొనొచ్చు కానీ బీఆర్‌ఎస్ కార్యకర్తలను, తెలంగాణ ఉద్యమకారులను కొనలేరని ధ్వజమెత్తారు.

"ఒక్కొక్క విషయం గురించి గ్రామాల్లో చర్చించాలి. మా వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండం అని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని బాండు పేపర్లు మీద సంతకాలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిన రాష్ట్రంలో ప్రభుత్వం ఏమి పడిపోదు. కామారెడ్డి జిల్లాలో రూ.2 లక్షల రుణమాఫీ అయిన వాళ్లు అందరూ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయండి. రుణమాఫీ కాని వాళ్లు కారు గుర్తు ఓటేయండి."- హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

దేశంలో బీజేపీ తెచ్చిన మార్పేంటి? : దేశంలో బీజేపీ తెచ్చిన మార్పు ఏంటని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. రాముడు అందరికీ దేవుడే, దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీని ఎద్దేవా చేశారు. వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పిందని గుర్తు చేశారు. అలాగే ప్రతి నెలా మహిళల ఖాతాలో రూ.2500 వేస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. బీడీ కార్మికుల నుంచి వికలాంగుల వరకు కేసీఆర్‌ పింఛన్‌ ఇచ్చారని హరీశ్‌ రావు తెలిపారు.

కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ - రైతులపై ఎందుకు లేదు: హరీశ్‌రావు

రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు: హరీశ్‌రావు

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల కేసు - పోలీసుల అదుపులో హరీశ్‌రావు మాజీ సిబ్బంది

Last Updated : Mar 31, 2024, 3:36 PM IST

ABOUT THE AUTHOR

...view details