తెలంగాణ

telangana

అబద్ధాలు చెప్పడంలో బీజేపీ బడేమియా -కాంగ్రెస్​ చోటేమియా : హరీశ్​రావు - Harish Rao Fires on BJP Congress

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 4:48 PM IST

Updated : Apr 12, 2024, 5:31 PM IST

Harish Rao Fires on BJP, Congress : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని మాజీమంత్రి హరీశ్​రావు ఆరోపించారు. సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్​లో బీఆర్ఎస్​ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. హస్తానికి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని, రాష్ట్రాభివృద్ధి బీఆర్​ఎస్​తోనే సాధ్యమని ఉద్ఘాటించారు.

BRS MP Election Campaign
Harish Rao Fires on BJP, Congress

Harish Rao Fires on BJP, Congress : కాంగ్రెస్ మాటలు నీటిమూటలేనని తప్పుడు వాగ్దానాలతో ప్రజలను హస్తం మోసగిస్తోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి(Congress Govt) వచ్చిందన్న ఆయన, గద్దెనెక్కిన తర్వాత ఆడబిడ్డలను మరిచిందని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్​లో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీశ్​రావు పాల్గొని, అధికార, విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్​ ఎక్కడైనా ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండదు : హరీశ్​ రావు - Lok Sabha Elections 2024

పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని హరీశ్​రావు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా రేవంత్ రెడ్డి గులాబీ పార్టీపై(BRS Party) అక్కసు వెళ్లగక్కుడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. హస్తం​ పార్టీ అధికార పీఠమెక్కి నాలుగు నెలలు కాకముందే, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే, పెనం మీద నుంచి పొయ్యిలో పడతామని తెలిపారు.

బీజేపీ బడేమియా -కాంగ్రెస్​ చోటేమియా : అబద్దాలు చెప్పడంలో బీజేపీ బడేమియా అయితే, కాంగ్రెస్ చోటేమియా అని, ఆ రెండు పార్టీలు అబద్దాల్లో పోటీ పడుతున్నాయన్నారు. గులాబీ పార్టీ లేకుండా చేయాలని బడే బాయ్ చోటే బాయ్ ఒక్కటయ్యారన్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దగ్గర సరుకు లేదు, పని లేదు అందుకే లీకులు ఫేకు వార్తలు కాలం గడుపుతున్నాయని విమర్శించారు. ఆనాడు చంద్రబాబు కోట్లు గుమ్మరించి తెలంగాణను వ్యతిరేకించినా, గులాబీ జెండానే గెలిచిందన్నారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని, రాష్ట్ర అభివృద్ధి బీఆర్​ఎస్​తోనే సాధ్యమని ఉద్ఘాటించారు.

"నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో లుకలుకలు స్టాట్ అయ్యాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఎలక్షన్ల ముందేమో రూ.2500 ఇచ్చి వడ్లు కొంటామని రేవంత్​ రెడ్డి ఆర్భాటంగా చెప్పారు. ఇవాళ జనగామ మార్కెట్​లో చూస్తే రూ.1560కు వడ్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. వీటిద్వారా చూస్తే వారి మాటలు నీటిమూటలేనని అర్థమౌతోంది. ఇవాళ కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే సిద్దిపేట వెటర్నరీ కాలేజీని కొడంగల్​కు తరలించుకొని పోయి రూ.150కోట్ల అభివృద్ధి పనులను ఆపింది."-హరీశ్​రావు, మాజీమంత్రి

Harish Rao Comments on Raghunandan Rao :తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ జెండాకు సిద్దిపేట అడ్డా అని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. జనగామలో రైతులు వడ్లు రూ. 1560కు అమ్ముకుంటున్నారని, రేవంత్ సర్కార్​ నేటికీ బోనస్ ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ(BJP) పదేళ్లలో పేదలకు ఏమి చేసిందో చెప్పకుండా రాముడి గుడి పేరిట రాజకీయం చేస్తున్నారని హరీశ్​రావు ఆక్షేపించారు.

ఉపఎన్నికల్లో అబద్దాలతో గెలిచి మాట తప్పిన రఘునందన్ రావుకు శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు బుద్ది చెప్పారని, దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్​లో ఎట్లా చెల్లుతుందని మాజీమంత్రి ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లో(Social Media) ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరలు పాల్గొన్నారు.

అబద్ధాలు చెప్పడంలో బీజేపీ బడేమియా -కాంగ్రెస్​ చోటేమియా : హరీశ్​రావు

వడ్లపై దృష్టి పెట్టమంటే రేవంత్‌ రెడ్డి వలసలపై దృష్టి పెట్టారు : హరీశ్‌రావు - Lok Sabha Elections 2024

ప్రచారంలో అబద్ధం, పాలనలో అసహనం - కాంగ్రెస్​ సర్కార్​పై బీఆర్​ఎస్ నేతల ధ్వజం

Last Updated :Apr 12, 2024, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details