తెలంగాణ

telangana

కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌ రావు! - ఎటూ తేల్చని అధిష్ఠానం - పార్టీ శ్రేణుల్లో అయోమయం - Karimnagar Congress MP Candidate

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 1:26 PM IST

Karimnagar Congress MP Candidate Issue : లోక్‌సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ప్రారంభమైనా, కాంగ్రెస్‌ కరీంనగర్‌ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్‌ అభ్యర్థిత్వాన్ని చివరి వరకు తేల్చలేదు. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకనప్పటికీ జిల్లా పార్టీ పక్షాన విడుదల చేసిన ప్రకటనలో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌ రావు అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

Congress Focus On Karimnagar MP Ticket
Karimnagar Congress MP Candidate Issue

కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిని తేల్చని కాంగ్రెస్‌ - జాప్యంపై పార్టీ శ్రేణుల్లో అయోమయం

Karimnagar Congress MP Candidate Issue: కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఎన్నిక విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతోంది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే తొలి విడత ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌లో మాత్రం అభ్యర్థి ఖరారులో ఎనలేని గందరగోళం చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ ఇదే తరహా చర్యలతో సరైన ఫలితాలను సాధించలేకపోయిందనే అభిప్రాయం ఏర్పడింది.

లోక్​సభ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్న సీఎం రేవంత్​ రెడ్డి - నేడు మహబూబ్​నగర్​, మహబూబాబాద్​లో​ పర్యటన - CM Revanth Election Campaign

Congress Focus On Karimnagar MP Ticket : ఇప్పుడు మళ్లీ అదే విధానాలను అవలంభిస్తోందని కార్యకర్తలు విసుగెత్తి పోతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ల సమక్షంలో కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల స్థాయి సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి. అన్నిచోట్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొని ప్రచారంపై దిశా నిర్దేశం చేస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేసి, పార్టీని గెలిపించుకుంటామని మంత్రి ప్రభాకర్‌ తెలిపారు. అనధికారికంగా మాత్రం వెలిచాల రాజేందర్‌రావు పేరును జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానం టికెట్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి ఆశిస్తున్నారు.

ప్రచారంలో ఉన్నట్లు రాజేందర్‌రావుకు టికెట్‌ వస్తే ఆయన మద్దతుదారుల స్పందన ఎలా ఉంటుందోనన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. కరీంనగర్‌లో రెండు వర్గాలు అన్నట్లుగా పార్టీ వ్యవహారం కొనసాగడం కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. అభ్యర్థి ప్రకటన ఆలస్యంతో ప్రచారంలో కొంత వెనుకబడి ఉన్నామనే భావన నెలకొంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 14 మంది పోటీపడగా, చివరకు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, రాజేందర్‌ రావు పేర్లను దిల్లీకి పంపించారు. అభ్యర్థి ఎంపికలో జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నేతల మధ్య ఏకాభిప్రాయం లేక ప్రకటన ఆలస్యమవుతోందనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా భావిస్తున్న రాజేందర్ రావు టికెట్ ఎవరికొచ్చినా పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని నాయకలను కోరారు.

"కరీంనగర్​లో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రచారం చేస్తాం. కరీంనగర్ అభ్యర్థి ప్రకటన ఒకటే మిగిలి ఉంది. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే పోరాడి బీఆర్ఎస్​ను బొంద పెట్టామో, బీజేపీని కూడా అలానే ఓడించాలి. బీజేపీ హటావో - భారత్ బచావో అనే నినాదంతో ముందుకు వెళ్లాలి."-పొన్నం ప్రభాకర్, మంత్రి

లోక్‌సభ ప్రచార బరిలో జోరు పెంచిన కాంగ్రెస్‌ - 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేతల వ్యూహాలు - Congress campaign six guarantees

ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్- స్టార్ క్యాంపెయినర్​గా రంగంలోకి సీఎం రేవంత్​రెడ్డి - lok sabha elections 2024

ABOUT THE AUTHOR

...view details