ETV Bharat / politics

లోక్​సభ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్న సీఎం రేవంత్​ రెడ్డి - నేడు మహబూబ్​నగర్​, మహబూబాబాద్​లో​ పర్యటన - CM Revanth Election Campaign

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 7:10 AM IST

CM Revanth Reddy Lok Sabha Elections Campaign : ఇవాళ్టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి లోక్​సభ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ఉదయం మహబూబ్​నగర్​, ఆ తర్వాత మహబూబాబాద్​ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే జన జాతర సభల్లో పాల్గొననున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మానుకోట జిల్లాకు విచ్చేస్తున్న రేవంత్​ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు.

CM Revanth Reddy Lok Sabha Election Campaign
CM Revanth Reddy Lok Sabha Election Campaign

నేటి నుంచి సీఎం రేవంత్​ ప్రచార భేరి - మహబూబ్​నగర్​, మహబూబాబాద్​లో​ పర్యటన

CM Revanth Reddy Lok Sabha Election Campaign : లోక్​సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నేటి నుంచి వరుస సభల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండు రోజుల కేరళ పర్యటనను ముగించుకుని సీఎం రేవంత్​ రెడ్డి రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తొలుత మహబూబ్​నగర్​లో ఆ లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్​ రెడ్డి నామినేషన్​ కార్యక్రమానికి రేవంత్​ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా సీఎం, చల్లా వంశీ సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్​కు వెళ్లనున్నారు. నామినేషన్​ దాఖలు చేసిన అనంతరం గడియారం కూడలి వద్ద జరిగే కార్నర్​ మీటింగ్​లో సీఎం రేవంత్​ పాల్గొంటారు.

మహబూబాబాద్​ జన జాతర సభకు సీఎం : అనంతరం మహబూబాబాద్​ ఎన్టీఆర్​ స్టేడియంలో జన జాతర సభలో సీఎం పాల్గొననున్నారు. ఇప్పటికే సభా ఏర్పాట్లను జిల్లా ఇంఛార్జ్​ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మురళీ నాయక్​, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్​ తదితరులు పరిశీలించారు. మహబూబాబాద్​ లోక్​సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మంది తరలివచ్చేలా నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు.

ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్​​రెడ్డి

"నిన్నటి నుంచి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు లక్ష మందికి పైగా జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతోనే గత మూడు, నాలుగు రోజులుగా ఇక్కడి ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. అనేక మీటింగ్​లు నిర్వహించుకున్నాం. మహబూబాబాద్​ ఇంఛార్జ్​ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఇక్కడికి వచ్చి వెళ్లారు. స్థల పరిశీలన, అక్కడి ఏరియా, ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంత మంది జన సమీకరణ చేయాలన్నది సూచించారు. మహబూబాబాద్​ నియోజకవర్గం నుంచి 30 వేల మంది, డోర్నకల్​ నియోజకవర్గం నుంచి 30 వేల మంది ఇలా లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం." - మురళీ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే

CM Revanth Visit to Mahabubabad : అధికారం చేపట్టిన నాలుగు నెలల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్​ రెడ్డి తొలిసారి మహబూబాబాద్​ ఎన్నికల ప్రచార సభకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని మహబూబ్​నగర్​, మహబూబాబాద్​లో పోలీసులు పటిష్ఠ భద్రతను కల్పించారు. మహబూబాబాద్​ పర్యటన తర్వాత సీఎం హెలికాప్టర్​లో హైదరాబాద్​ బయలుదేరి వెళ్లనున్నారు.

జూన్ 9న రాహుల్​ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం : రేవంత్​ రెడ్డి

ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్- స్టార్ క్యాంపెయినర్​గా రంగంలోకి సీఎం రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.