తెలంగాణ

telangana

సికింద్రాబాద్‌, వరంగల్‌ నియోజకవర్గ నేతలతో సీఎం సమావేశం - lok sabha election 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 3:02 PM IST

CM Revanth Reddy Meet with Parliament Constituency Leaders : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నేతలతో సమావేశాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో వరంగల్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy Meet with Parliament Constituency Leaders
CM Revanth Reddy Meet with Parliament Constituency Leaders

CM Revanth Reddy Meet with Parliament Constituency Leaders :పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. శనివారం తుక్కుగూడలో జరిగిన జన జాతర సభ విజయవంతం కావడంతో కార్యకర్తలు, కేడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లకు గానూ 14 గెలిచి తీరుతామని కాంగ్రెస్‌ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి మాత్రం రాష్ట్రంలో 14 స్థానాలు గెలిచి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుని వరుసపెట్టి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు, ఇంఛార్జిలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ముందుగా వరంగల్‌ నియోజకవర్గ ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్‌ రెడ్డి, వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరికి సీఎం రేవంత్‌ రెడ్డి గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టే విధంగా చేయాలని సూచించారు.

రాష్ట్రంలో రోజురోజుకూ మారుతోన్న రాజకీయ పరిణామాలు - చేరికల తలుపులు తెరిచిన కాంగ్రెస్

సికింద్రాబాద్‌ నేతలతో సీఎం సమావేశం : ఆ తర్వాత సికింద్రాబాద్‌ నియోజకవర్గ ముఖ్య నేతలతో కూడా సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో నేతలు సీఎం రేవంత్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

బీఆర్​ఎస్​ నుంచి మరో ఎమ్మెల్యే జంప్​ - కాంగ్రెస్​ కండువా కప్పుకున్న తెల్లం వెంకట్రావు

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు - బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ

ABOUT THE AUTHOR

...view details