తెలంగాణ

telangana

రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని మోదీతో కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారు : సీఎం రేవంత్​ రెడ్డి - Revanth Reddy Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 9:04 PM IST

CM Revanth Reddy Election Campaign in Malkajgiri : రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని ప్రధాని మోదీతో బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట గులాబీ పార్టీ​ తన మద్దతు కమల పార్టీకి ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో జరిగిన ‘జన జాతర’ సభలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చి మల్కాజిగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.

Revanth Reddy Campaign Support to Sunitha Mahendar Reddy
CM Revanth Reddy Election Campaign

పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చి మల్కాజిగిరి ప్రజల రుణం తీర్చుకుంటాను సీఎం రేవంత్​ రెడ్డి

CM Revanth Reddy Election Campaign in Malkajgiri : కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట బీఆర్ఎస్​ తన మద్దతు బీజేపీకి ఇస్తోందని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. గులాబీ అధినేత కేసీఆర్ బీజేపీ వాళ్లతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు తనను ఆదుకున్నది మల్కాజిగిరి ప్రజలేనని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో జరిగిన ‘జన జాతర’ సభలో ఆయన పాల్గొన్నారు. హస్తం పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు.

CM Revanth Reddy Speech at Malkajgiri: కష్టకాలంలో ఉన్నప్పుడు తనను ఆదుకున్నది మల్కాజిగిరి ప్రజలేనని సీఎం రేవంత్ గుర్తు చేశారు. తనకు అండగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఇప్పుడు మంచి అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చి మల్కాజిగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడూ మరిచిపోనని, ఇక్కడ ఎంపీగా చేసిన పోరాటంతోనే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని పేర్కొన్నారు. ఆ పదవి తర్వాత సీఎం కూడా అయ్యానని తెలిపారు. రాజకీయాల్లో పడిపోతున్న తనను ఉన్నత స్థానంలో నిలబెట్టింది మల్కాజిగిరి ప్రజలేనని అన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి జరగకపోవటం వల్లే భూముల ధరలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి - నేడు భువనగిరిలో పర్యటన - CM Revanth Campaign in Bhuvanagiri

Revanth Reddy Comments on Modi : సంక్షేమం గురించి చెప్పుకోవడానికి బీజేపీ వద్ద ఏమీ లేదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ఏమీలేకనే మతం గురించి మాట్లాడుతోందని విమర్శించారు. ఆకలి సూచీలో భారత్‌దేశం ఇప్పటికీ 111వ స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో ఆకలి చావులు తగ్గించడానికి మోదీ చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని మోదీతో కేసీఆర్‌ ఒప్పందం చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట బీఆర్​ఎస్​ తన మద్దతు బీజేపీకి ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఓట్ల కోసం ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. మతాలు, భాషల మధ్య చిచ్చుపెట్టి గెలవాలని బీజేపీ చూస్తోంది. కమ్యూనిస్టునని చెప్పుకునే ఈటల రాజేందర్‌ మోదీ విధానాలను ఎలా సమర్థిస్తారు. రాముడి పేరు మీద బీజేపీ ఇంకెంత కాలం రాజకీయం చేస్తుంది. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు. దేవుడి పేరు మీద రాజకీయం చేసే వారిని పొలిమేర వరకు తరిమికొట్టాలి." - రేవంత్​ రెడ్డి, ముఖ్యమంత్రి

బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి - నేడు ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజి​గిరిలో ప్రచారం - REVANTH ELECTION CAMPAIGN SCHEDULE


Revanth Reddy Fire on BRS : బీఆర్​ఎస్​ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. ఇన్నాళ్లు తనను గుండెల్లో పెట్టుకున్న హుజూరాబాద్‌ ప్రజలు, ఇప్పుడు ఎందుకు ఓడించారో ఈటల రాజేందర్​ సమాధానం చెప్పాలని నిలదీశారు. కేసీఆర్‌, కేటీఆర్ అవినీతిపై విచారణ జరపాలని అమిత్ షాను ఈటల ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. కేటీఆర్ అవినీతి, ఫోన్ల ట్యాపింగ్‌ గురించి ఈటల ఎందుకు మాట్లాడటం లేదన్నారు. మోదీ ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు ఈటల రాజేందర్‌ సిద్ధమా? అని సవాల్ విసిరారు. పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ తెలంగాణకు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే, అవి రద్దు చేసేవరకు కాంగ్రెస్‌ పోరాటం చేసిందని గుర్తు చేశారు.

కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసి ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి - Revanth Reddy Election Campaign

నమో అంటేనే 'నమ్మించి మోసం' చేయడం - కర్ణాటక లోక్​సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ - REVANTH SLAMS MODI IN BENGALURU

ABOUT THE AUTHOR

...view details