ETV Bharat / politics

బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి - నేడు ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజి​గిరిలో ప్రచారం - REVANTH ELECTION CAMPAIGN SCHEDULE

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 22, 2024, 7:57 AM IST

CM Revanth Reddy Election Campaign 2024 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజి​గిరి జిల్లాల్లో లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఈ నెల 26 వరకు రాష్ట్రంలో సీఎం విస్తృతంగా పర్యటించేందుకు పీసీసీ కార్యాచరణ సిద్ధం చేసింది.

CM Revanth MP Nomination Rally
CM Revanth Reddy Election Campaign 2024

ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి - నేడు ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజి​గిరిలో పర్యటనలు

CM Revanth Election Campaign Schedule Today : రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేసే కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయకుండా పెండింగ్ ఉంచిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ మినహా మిగిలిన 14 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉండడంతో ఒక్కొక్కరు ఒక్కరోజు వేస్తున్నారు. ఒకరిద్దరి నామినేషన్ కార్యక్రమాలకు హాజరు కాలేకపోతే కార్నర్ మీటింగ్‌లకు సీఎం హాజరవుతున్నారు.

Congress Campaign In Telangana : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఛరిష్మా తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల పీసీసీలు కూడా వాడుకునేందుకు చొరవ చూపుతున్నారు. ఏఐసీసీతో రేవంత్​ను ప్రచారానికి రప్పించాలని చెబుతున్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం రోజున భువనగిరి కార్నర్ ఎన్నికల సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఇవాళ ఏకంగా మూడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజి​గిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించి ఆత్రం సుగుణ, జీవన్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ల కార్యక్రమాలకు హాజరవుతారు.

రాష్ట్రంలో 14 ఎంపీలను గెలిపించి సోనియమ్మకు కానుకగా ఇద్దాం : సీఎం రేవంత్​ - Lok Sabha Polls 2024

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు : ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం ఒంటి గంటలకు నిజామాబాద్, సాయంత్రం 4 గంటలకు మల్కాజి​గిరి లోక్‌సభ నియోజకవర్గం బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. రేపు నాగర్ కర్నూల్ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 24 వరంగల్, 25న చేవెళ్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రంలో మిషన్ 15 పేరుతో 15 స్థానాల్లో విజయం లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. నామినేషన్ల కార్యక్రమం పూర్తయ్యాక భహిరంగ సభలు, రోడ్ షోలకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వీటిలో సీఎం రేవంత్​రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు కూడా పాల్గొంటారు.

Lok Sabha Nominations In Telangana : సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి షెడ్యూల్ తయారీలో నిమగ్నమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ ప్రక్రియ మొదలవక ముందే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తారని పీసీసీ భావించింది. కానీ నామినేషన్ల ప్రక్రియ మొదలై అయిదు రోజులైనా ఆ మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడలేదు. ఎప్పుడు ప్రకటన వస్తుందా అని ఆశావహులు వేచి చూస్తున్నారు.

భువనగిరి కోట కాంగ్రెస్​ కంచుకోటగా మరోసారి నిరూపించాలి : రేవంత్​ రెడ్డి - CM Revanth Election Campaign

నమో అంటేనే 'నమ్మించి మోసం' చేయడం - కర్ణాటక లోక్​సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ - REVANTH SLAMS MODI IN BENGALURU

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.