తెలంగాణ

telangana

ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరుతో భారీ మోసాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? - Prathidwani on fraud in real estate

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 11:27 AM IST

Debate on Pre Launch Fraud in RealEstate Market : ఈ మధ్య కాలంలో కొన్ని రియల్​ ఎస్టేట్​ సంస్థలు ప్రీ లాంచ్​ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారులను భారీగా మోసం చేసి లాభాలు ఆర్జిస్తున్నాయి. తప్పుడు సమాచారమిస్తూ, మోసపూరితంగా ప్లాట్లు అమ్ముతున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై ఇప్పటికే రెరా కొరఢా ఝుళిపించింది. ఈ అంశంపై నేటి ప్రతిధ్వని.
PRE LAUNCH FRAUD IN REALESTATE
Debate on Pre Launch Fraud in RealEstate Market

Debate on Pre Launch Fraud in Real Estate Market :ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారులను మోసం చేస్తున్నాయి కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు. అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు విక్రయించి రూ.కోట్లు ఆర్జిస్తున్నాయి. ఇలాంటి రియల్‌ కంపెనీలపై వేటు తప్పదని హెచ్చరించింది రియల్ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ. మార్కెట్‌ ధర కంటే అతి తక్కువకే లభిస్తుందంటూ ఫ్లాట్లు, వాణిజ్య స్థలాలు అమ్మేస్తున్న బిల్డాక్స్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థపై 'రెరా' కొరఢా ఝుళిపించింది. ఆ సంస్థకు రూ.3 కోట్ల 96 లక్షల జరిమానా విధించింది.

రియల్‌ రంగంలో ప్రీ లాంచింగ్‌ ఆఫర్లకు ఎందుకింతగా డిమాండ్‌ ఏర్పడింది? అనుమతులు పొందని సంస్థలు ఇచ్చే ప్రీలాంచ్‌ ఆఫర్ల వలలో చిక్కితే కొనుగోలుదారులకు జరిగే నష్టం ఏంటి? ఇలాంటి మోసాలబారిన పడుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాపార ప్రకటనలు విడుదల చేస్తూ, ప్లాట్లు అమ్ముకుంటున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలను గుర్తించడం ఎలా? వాటి అక్రమాలపై చర్యలు తీసుకునే అధికారం ఏ ఏ ప్రభుత్వ విభాగాలకు ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details