తెలంగాణ

telangana

నవాజ్​ అనూహ్య నిర్ణయం- ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌, సీఎంగా కూతురు ఎంపిక

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 6:38 AM IST

Updated : Feb 14, 2024, 7:37 AM IST

Pakistan New Prime Minister Name : పాకిస్థాన్​ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌ షరీఫ్‌ను నామినేట్​ చేశారు మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌. ఆయన నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్​-న్​) పార్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి మారియం ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. మరోవైపు నవాజ్‌ కుమార్తె మరియం నవాజ్‌ను పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.

Pakistan New Prime Minister Name
Pakistan New Prime Minister Name

Pakistan New Prime Minister Name : నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్​-న్​) పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌ షరీఫ్‌ను నామినేట్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి మారియం ఔరంగజేబు సామాజిక మధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. తమ పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్‌ షెహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని పదవికి నామినేట్‌ చేశారని తెలిపారు. నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరియం నవాజ్‌ను పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.

మిత్రపార్టీలకు నవాజ్​ థ్యాంక్స్​
పీఎంఎల్​-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రాజకీయ పార్టీలకు మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్​ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను, గాడిన పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నవాజ్​ షరీఫ్​ చిన్న తమ్ముడైన 72 ఏళ్ల షెహబాజ్‌ షరీఫ్‌కు పాక్​ ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉంది.

'దొంగ ఓట్లతో ప్రభుత్వ ఏర్పాటు దురదృష్టకరం'
షెహబాజ్​ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్న వార్తలపై స్పందించారు పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. నవాజ్​తో పాటు ఆయనకు మద్దతు తెలుపుతున్న పలు రాజకీయ పార్టీలపై మండిపడ్డారు. దొంగ ఓట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఇమ్రాన్​ ఖాన్​ లేకుండా ప్రజాస్వామ్యం పనిచేయదని, ఆయన లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పాటు కాదని సంకీర్ణ ప్రభుత్వం కోసం ప్రధాన పార్టీలు చర్చలు జరుపుతున్న వేళ పార్టీలోని ఓ సీనియర్​ నాయకడు అన్నారు.

భుట్టోకు కీలక పదవులు
అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని తమ పార్టీ సాధించలేకపోవడం వల్ల ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు పాకిస్థాన్ పీపుల్స్‌ పార్టీ-పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ తెలిపారు. దేశంలో రాజకీయ సుస్థిరత కోసం నూతన ప్రభుత్వంలో తమ పార్టీ భాగమవ్వకుండానే పీఎంఎల్‌-ఎన్‌కు చెందిన ప్రధాన మంత్రి అభ్యర్థికి మద్దతు పలకాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు పీటీఐ పార్టీ నిరాకరించడం వల్లే పీఎంఎల్​-ఎన్​ వైపు మొగ్గు చూపామని పేర్కొన్నారు. భుట్టో పార్టీకి దేశ అధ్యక్ష పదవి, జాతీయ అసెంబ్లీ స్పీకర్‌, సెనేట్‌ ఛైర్మన్‌ సహా కీలక పదవులు కట్టబెట్టే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

ఎట్టకేలకు పాక్ సైన్యం ఆశీస్సులతో
పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన సీట్లు రాకపోవడం వల్ల సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. దీంతో పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ, బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీతో చర్చలు జరిపింది. ఇక 265 స్థానాలున్న పాక్‌ జాతీయ అసెంబ్లీకి ఈనెల 8న ఎన్నికలు జరిగాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలుపొందారు. పీఎంఎల్‌-ఎన్‌ 75 స్థానాల్లో, పీపీపీ 54 స్థానాల్లో గెలుపొందింది.

మూడేళ్లు నవాజ్​- రెండేళ్లు భుట్టో- పాక్​లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం!

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు భుట్టో ఓకే- దేశాన్ని రక్షించేందుకే పొత్తు అన్న నవాజ్ పార్టీ!

Last Updated : Feb 14, 2024, 7:37 AM IST

ABOUT THE AUTHOR

...view details