తెలంగాణ

telangana

చైనాలో కుప్పకూలిన హైవే- 24 మంది మృతి - China Highway Collapse

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 10:53 AM IST

Updated : May 1, 2024, 3:51 PM IST

China Highway Collapse: దక్షిణ చైనాలోని ఓ హైవే కుప్పకూలిన ఘటనలో సుమారు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందిని రక్షించిన సహాయక సిబ్బంది, వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

China Highway Collapse
China Highway Collapse

China Highway Collapse:దక్షిణ చైనాలోని గ్యాంగ్​డాంగ్​లో హైవే కుప్పకూలడం వల్ల సుమారు 24 మంది మరణించారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా ధ్రువీకరించింది. హైవేలో ఒక భాగం కుప్పకూలిందని తెలిపింది. అనేక కార్లు ధ్వంసమయ్యాయి. ఇటీవల ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఇదే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. హైవే కింద చిక్కుకుపోయిన సుమారు 30మందిని సహాయక సిబ్బంది రక్షించి ఆస్పత్రులకు తరలించారు. హైవేను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

వర్ష బీభత్సం వల్లేనా?
గ్వాంగ్‌డాంగ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. గత 65 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాల కారణంగా నలుగురు చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు. గ్వాంగ్‌డాంగ్ రాజధాని గ్వాంగ్‌జౌ జల దిగ్బంధంలో చిక్కుకుంది. పెరల్ నది దిగువన ఉన్న పెరల్ రివర్ డెల్టాలో పెద్ద ప్రాంతం కూడా నీటిలో మునిగిపోయింది. ఈ వర్షం దెబ్బకి దాదాపు 1.25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 26 వేల మందిని షెల్టర్ హోమ్‌లకు పంపారు. ఏప్రిల్ నెలలో గ్వాంగ్‌జౌలో 60.9 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది.

రోడ్లపై పడవలు తిరిగే పరిస్థితి!
1959 తర్వాత గ్వాంగ్‌జ్​లో ఇంత భారీ వర్షాలు కురువడం ఇదే తొలిసారి. జావోకింగ్ నగరంలో ముగ్గురు మరణించగా, షావోగ్వాన్ నగరంలో ఒకరు చనిపోయినట్లు ప్రకటించారు. గ్వాంగ్‌డాంగ్‌లో రోడ్లపై పడవలు తిరిగే పరిస్థితి నెలకొంది. ఈ భారీ వర్షాల వల్లే హైవే బాగా ప్రభావితమై కుప్పకూలినట్లు అధికారులు భావిస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం!
కొన్నిరోజుల క్రితం, వాయువ్య చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 127మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 700మందికి పైగానే గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రకృతి విపత్తుతో గన్సు, కింగ్‌ హై ప్రావిన్స్‌లలో ఒక్కసారిగా ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయని పేర్కొన్నారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్​పై 6.2గా నమోదు అయ్యిందని చైనా భూకంప నెట్​వర్క్​ కేంద్రం తెలిపింది.

Last Updated :May 1, 2024, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details