తెలంగాణ

telangana

సమ్మర్​లో మూత్రం మంటగా వస్తోందా? - ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్స్ ఆల్ క్లియర్! - Summer Urinary Problems

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 11:42 AM IST

Best Tips To Keep Body Cool in Summer : రోజురోజుకూ ఎండలు దంచికొడుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ మొదలు మూత్ర సంబంధిత సమస్యల వరకూ చాలా ఇబ్బందులు వస్తాయి. అయితే.. కొన్ని టిప్స్ పాటించారంటే వీటికి చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

How To Avoid Urinary Problems in Summer
How To Avoid Urinary Problems in Summer

How To Avoid Urinary Problems in Summer :ఎండలు విజృంభిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి బయట కొద్దిసేపు తిరిగితేనే నీరసం, నిస్సత్తువ, అలసట ఆవహించేస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో మూత్ర సంబంధిత సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ ఉంటుంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధిగమించడానికి కొన్ని టిప్స్ ఫాలో కావాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హైడ్రేటెడ్​గా ఉండండి : వేడి వాతావరణంలో డీహైడ్రేషన్​కు గురైతే మూత్రం గాఢతకు దారితీస్తుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి డైలీ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగుతూ బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్​గా ఉంచాలని సూచిస్తున్నారు నిపుణులు.

కెఫెన్, ఆల్కహాల్ అధికంగా తీసుకోకండి : కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి పానీయాలు మూత్రవిసర్జనపై ప్రభావం చూపిస్తాయి. ఇవి మూత్ర ఉత్పత్తిని పెంచడానికి, డీహైడ్రేషన్​కు దారితీస్తాయి. కాబట్టి ఎండాకాలం ఈ పానీయాలను అధికంగా తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు.

2015లో "జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్" అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఎండాకాలంలో రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వ్యక్తులలో డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం 20% ఎక్కువగా ఉందని తేలింది. ఈ పరిశోధనలో యూఎస్​లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​కు చెందిన ప్రముఖ డాక్డర్ మైఖేల్ ఫెర్రీ పాల్గొన్నారు. సమ్మర్​లో డైలీ ఎక్కువ కాఫీ తాగే వ్యక్తులలో బాడీ ఎక్కువగా డీహైడ్రేషన్​కు లోనయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

ఈ ఫ్యాబ్రిక్స్ ధరించండి : సమ్మర్​లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి కాటన్​తో తయారు చేసిన తేలికైన, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మీ శరీరానికి తగినంత గాలి ప్రసరించడానికి తోడ్పడతాయి. అలాగే.. మీ బాడీ ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, అధిక చెమటను నిరోధించడంలో చాలా బాగా సహాయపడతాయని సూచిస్తున్నారు.

ఎండాకాలంలో రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఈ ఫుడ్స్ తినండి : పుచ్చకాయ, కీర దోస, స్ట్రాబెర్రీలు, ఆకు కూరలు వంటి హైడ్రేటింగ్, కూలింగ్ ఫుడ్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవాంటున్నారు నిపుణులు. ఈ ఆహారాలు అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు.

పరిశుభ్రతను పాటించండి : సమ్మర్​లో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నివారించడానికి సరైన పరిశుభ్రత చాలా అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వాష్​రూమ్ వెళ్లొచ్చిన తర్వాత కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రెండు పూటలా స్నానం చేయడం ద్వారా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచవచ్చంటున్నారు.

వ్యాయామం చేయండి :ఉదయాన్నే ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఎక్సర్​సైజ్​లు ఎండ వేడి పెద్దగా లేని సమయాల్లోనే చేయాలని చెబుతున్నారు. ఈ టిప్స్ పాటిస్తే.. ఎండా కాలంలో కూడా ఎలాంటి మూత్ర సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండాకాలంలో స్ట్రోక్ ప్రమాదం! ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే! - Heart Stroke In Summer

ABOUT THE AUTHOR

...view details