తెలంగాణ

telangana

కర్రీ చేసేముందు చికెన్ ముక్కలు కడగొద్దా! - కడిగితే ఏమవుతుందో మీకు తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 10:33 AM IST

Cleaning Chicken Before Cooking is Good or Bad : చికెన్ వండే ముందు చాలా మంది ముక్కలు బాగా కడుగుతారు. శుభ్రం చేస్తేనే డస్ట్ తొలగిపోతుందని భావిస్తారు. కానీ.. ఇలా క్లీన్ చేయడం తీవ్రమైన అనారోగ్యానికి దారితీసే ఛాన్స్ ఉందని మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Cleaning Chicken Before Cooking is Good or Bad
Cleaning Chicken Before Cooking is Good or Bad

Cleaning Chicken Before Cooking is Good or Bad :చికెన్​ ఎంతో మంది అద్భుతంగా వండగలరు.. అద్దిరిపోయే టేస్ట్ తీసుకురాగలరు. కానీ.. చికెన్​కు సంబంధించిన ఇతర విషయాలు వారికి తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి చికెన్ క్లీనింగ్. చికెన్ వండే ముందు చాలా మంది శుభ్రంగా కడుగుతారు. కానీ.. ఇలా కడగడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. "ది కాన్వర్సేషన్‌"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం కూడా.. చికెన్ వండే ముందు శుభ్రం చేయకూడదట.

ఎందుకు క్లీన్ చేయొద్దు?

చికెన్‌లో హానికరమైన సూక్ష్మజీవులు ఉంటాయనేది నిజమే. కానీ.. వంట చేయడానికి ముందు చికెన్ ముక్కలను కడగడం ద్వారా ఆ బ్యాక్టీరియాను తొలగించలేమని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా చికెన్‌లో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా రకాలు ఉంటాయి. ఇవి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతాయి. ఇన్ఫెక్షన్లు, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులు కలిగిస్తాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఇవి మరింతగా ప్రభావం చూపిస్తాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు వెంటనే అనారోగ్యానికి గురవుతారు.

సండే ధమాకా - కీమా బిర్యానీ ఇలా ట్రై చేయండి! అద్దిరిపోద్ది!

విస్తరిస్తాయి..

సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వల్ల ఒక్కోసారి తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ కలిగితే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందట. కొన్ని కేసుల్లో మరణాలు సంభవించినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఇలాంటి బ్యాక్టీరియా ఉన్న చికెన్​ను వంట గదిలో బయటకు తీసి దాన్ని మరో గిన్నెలోకి తీసుకొని చేతులతో శుభ్రం చేయడం వంటి చర్యల వల్ల.. ఆ చికెన్ అంటుకున్న ప్రతి చోటా ఈ బ్యాక్టీరియా అంటుకుంటుంది. మనం చికెన్ పట్టుకొని అదే చేత్తే ఇంకా ఏవేవో వస్తువులు ముట్టుకుంటాం. దాంతో.. వాటన్నింటికీ బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఇలా.. వంట గది మొత్తం వ్యాపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా కళ్లు, ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఛాన్స్ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. చికెన్​ను కడగకుండా వండాలని సూచిస్తున్నారు.

మరి.. బ్యాక్టీరియా ఎలా?

ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఏమంటే.. కడగకుండానే వండితే అందులోని బ్యాక్టీరియా పరిస్థితి ఏంటి? తింటే నేరుగా శరీరంలోకి వెళ్లిపోతుంది కదా అనుకుంటారు. అయితే.. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. మనం కుక్ చేసే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. అంత వేడిలో ఏ బ్యాక్టీరియా కూడా బతకదని చెబుతున్నారు. అందువల్ల ఎలాంటి టెన్షన్ లేకుండా చికెన్ నేరుగా కుక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక చికెన్ వండేటప్పుడు చేతులు ముక్కు, ముఖం మీద పెట్టుకోవద్దని చెబుతున్నారు. కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత సబ్బుతో చేతులు, గిన్నెలు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

తందూరి చికెన్ రోల్స్ ట్రై చేస్తారా? - ఇంట్లోనే యమ్మీ యమ్మీగా లాంగిచేస్తారు!

ABOUT THE AUTHOR

...view details