తెలంగాణ

telangana

జుట్టు పెరగడం లేదని బాధపడుతున్నారా? - పాలకూరను ఇలా వాడారంటే​ రిజల్ట్​ పక్కా!

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 7:32 PM IST

Updated : Mar 21, 2024, 2:42 PM IST

Spinach for Hair Growth : మీరు జుట్టు రాలడం, చిట్లిపోవడం, చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఓ సారి పాలకూరతో ఈ హెయిర్ మాస్క్​లు ట్రై చేసి చూడండి. మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ తగ్గడమే కాదు! జుట్టు బలంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవ్వడం పక్కా అంటున్నారు ఆరోగ్యనిపుణులు! అవేంటో ఇప్పుడు చూద్దాం.

Hair
Spinach for Hair Growth

How to Use Spinach for Hair Growth : ఈరోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్​ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జుట్టు ఊడిపోకుండా, ఉన్న జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఆయిల్స్​, చిట్కాలు ట్రై చేస్తుంటారు. ఇక కొందరైతే వేలవేలకు ఖర్చు చేసి జుట్టు(Hair)పెరుగుదల కోసం ట్రీట్​మెంట్స్ కూడా తీసుకుంటుంటారు. అయినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటుంది. అలాంటి వారికి పాలకూరను వాడమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల జుట్టు మందంగా, ఆరోగ్యకరంగా, బలంగా తయారవ్వడం గ్యారంటీ అంటున్నారు. ఇంతకీ, పాలకూరను జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తక్కిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూర మీ వెంట్రుకలకు ఎక్కువ మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు బలంగా ఎదగడానికి తోడ్పడుతాయి. అలాగే జుట్టు పెరగడానికి కెరాటిన్‌, కొలాజిన్‌ ఈ రెండూ చాలా అవసరం. విటమిన్‌ బి, సి లు పుష్కలంగా ఉండే పాలకూర ఈ రెండింటినీ సమృద్ధిగా అందించి రాలిన జుట్టు రావడానికీ, వేగంగా పెరగడానికీ చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు మాడు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. పాలకూరలో పుష్కలంగా ఉండే ఐరన్ వెంట్రుక మొదళ్లకు ఆక్సిజన్‌ అందించి అవి రాలకుండా చూస్తుందంటున్నారు నిపుణులు. ఇక పాలకూరను హెయిర్ గ్రోత్ కోసం ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

స్పినాచ్ హెయిర్ మాస్క్ : మీ జుట్టు పెరుగుదలకు పాలకూర హెయిర్ మాస్క్​ చాలా చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇక దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే.. ముందుగా కట్​ చేసిన ఒక కప్పు పాలకూర ఆకులు తీసుకొని లైట్​గా వాటర్​ కలుపుకొని ఫ్యూరీలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మీ స్కాల్ప్, హెయిర్​కి అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో హెడ్ బాత్ చేయాలి.

పాలకూర రసం :ఇది కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనిని ఎలా సిద్ధం చేసుకోవాలంటే.. ముందుగా మిక్సీ జార్​లో ఒక గుప్పెడు కట్​ చేసిన పాలకూర ఆకులను తీసుకొని, కొద్ది మొత్తంలో వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్​లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పాలకూర రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరానికి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు అందుతాయంటున్నారు నిపుణులు.

పాలకూర, పెరుగు హెయిర్ మాస్క్ : మీ జుట్టు ఒత్తుగా పెరగడంలో ఈ మాస్క్ కూడా చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే.. ముందుగా ఒక కప్పు కట్ చేసిన పాలకూర ఆకులను తీసుకొని మెత్తని పేస్ట్​లా చేసుకోవాలి. ఆపై దానికి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని తల, జుట్టుకు అప్లై చేసి 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచి అనంతరం షాంపూతో తలస్నానం చేయాలి.

మగాళ్లలో జుట్టు రాలే సమస్య - మీకు తల స్నానం చేయడం రాకనే!

పాలకూర, కొబ్బరి నూనె స్కాల్ప్ మసాజ్ :ఇదీ మీ జుట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. మీరు ముందుగా కొన్ని కట్ చేసిన పాలకూర ఆకులను తీసుకొని మిక్సీలో ప్యూరీలా పట్టుకోవాలి. ఆపై దానికి కాస్త కొబ్బరి నూనె యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం దానిని మీ తలకు మసాజ్ చేయడానికి ఉపయోగించాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడడమే కాకుండా జుట్టు కుదుళ్లకు పోషకాలను అందజేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

పాలకూర, గుడ్డు హెయిర్ మాస్క్ : ఇది ఒక ప్రొటీన్ రిచ్ హెయిర్ మాస్క్. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఈ మాస్క్​ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే.. ముందుగా మిక్సీలో పాలకూర ప్యూరీని తయారు చేసుకొని దానిలో కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని బాగా కలిపి మీ జుట్టు, స్కాల్ప్‌కి అప్లై చేసి.. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత సున్నితమైన షాంపూతో హెడ్ బాత్ చేయాలి. ఈ మాస్క్​లను తరచుగా ట్రై చేశారంటే మీ వెంట్రుకలు ఆరోగ్యంగా, బలంగా మారడం ఖాయమంటున్నారు నిపుణులు! అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఎవరైనా శరీరానికి పాలకూర పడకపోతే దీనిని ఉపయోగించకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

జుట్టు విపరీతంగా రాలుతోందా? - ఈ అలవాట్లతో చెక్ పెట్టండి​!

Last Updated : Mar 21, 2024, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details