ETV Bharat / health

జుట్టు విపరీతంగా రాలుతోందా? - ఈ అలవాట్లతో చెక్ పెట్టండి​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 4:40 PM IST

Premature Hair Loss Prevent Tips: ఈ రోజుల్లో జుట్టు రాలడం కామన్ అయింది. ముఖ్యంగా యువత ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మరి మీ జుట్టు కూడా రాలుతోందా..? అయితే ఈ అలవాట్లు డైలీ ఫాలో అయ్యారంటే ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు! అవేంటో ఇప్పుడు చూద్దాం..

Hair Loss Prevent Tips
Hair Loss

Habits to Prevent Premature Hair Loss: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు. సాధారణంగా రోజూ కొన్ని వెంట్రుకలు రాలడం సహజం. కానీ, పలు కారణాల వల్ల చాలా మందిలో ఎక్కువ మొత్తంలో వెంట్రుకలు రాలి.. జుట్టు పల్చగా మారిపోతోంది. దీంతో బట్టతల సమస్య తలెత్తుతోంది. ఆ కారణంగా చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ.. నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిపడుతుంటారు. ఈ క్రమంలో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు, మందులు వాడుతుంటారు. అలాగే కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు. ఇవన్నీ చేసినా కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ వేధిస్తోందా? అయితే ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు డైలీ ఫాలో అయ్యారంటే చాలు.. మీ జుట్టు రాలే సమస్య ఇట్టే తగ్గిపోతుంది.

సమతుల్య ఆహారం: చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్​తో ఇబ్బందిపడుతున్నట్లయితే మీ లైఫ్ స్టైల్​లో కొన్ని మార్పులు చేయాలి. అందులో ముఖ్యంగా మీ డైట్​లో సమతుల్య ఆహారం ఉండేలా చూసుకోవాలి. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్లు, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు అధికంగా ఉండేలా చూసుకోండి. అందుకోసం వివిధ రకాల పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు, గుడ్లు, చేపలు వంటి ఆహారాలు మీరు తినే ఫుడ్​లో చేర్చుకోండి. అదేవిధంగా జంక్​ఫుడ్స్​, ప్రాసెస్డ్​ ఫుడ్స్​ తినడం మానుకోండి.

ఒత్తిడి నిర్వహణ: ఈ రోజుల్లో జుట్టు రాలడానికి ఒత్తిడి కూడా ప్రధాన కారణం. ఈ ఒత్తిడి కారణంగా శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తాయి. కాబట్టి రోజులో కొంత సమయం స్ట్రెస్ కంట్రోలింగ్ వ్యాయామాల కోసం కేటాయించాలి. యోగా, ధ్యానం, డీప్ బ్రీతింగ్ ఎక్సర్​సైజెస్ వంటివి చేయాలి.

రెగ్యులర్ వ్యాయామం: శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసమే కాదు.. మీరు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ నుంచి ఉపశమనం పొందాలన్నా రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అలా చేయడం ద్వారా నెత్తి మీద చర్మంతో సహా జుట్టు మూలాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అది జుట్టు పెరుగుదలను, ఆరోగ్యకరమైన స్కాల్ప్​ను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!

సున్నితమైన జుట్టు సంరక్షణ: చాలా మంది జుట్టు సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా ఎలా పడితే అలా జుట్టు దువ్వడం, ఇతరుల వాడిన దువ్వెనలు వాడడం, ఏ షాంపూలు పడితే అవి యూజ్ చేస్తుంటారు. అలాకాకుండా జుట్టు దువ్వేటప్పుడు సున్నితంగా దువ్వడం, మంచి దువ్వెనలు వాడటం చేయాలి. అదేవిధంగా మీ జుట్టు రకానికి సరిపోయే తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూలు ఉపయోగించడం మంచిది.

తగినంత వాటర్ తాగడం: జుట్టు ఆరోగ్యంతో సహా మొత్తం ఆరోగ్యానికి రోజూ తగినంత వాటర్ తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే డీహైడ్రేషన్ సమస్య తలెత్తి అది ఆరోగ్యంపై మాత్రమే కాకుండా జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే డైలీ తగిన మొత్తంలో వాటర్ తాగాలి.

హీట్ స్టైలింగ్​ను తగ్గించాలి: చాలా మంది జుట్టును రకరకాల స్టైల్ చేసుకునేందుకు కర్లింగ్ ఐరన్​లు, స్ట్రెయిట్​నర్​లు, బ్లో డ్రైయర్​లు వంటి హీట్ స్టైలింగ్ మెషిన్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటి కారణంగా జుట్టు దెబ్బతిని అధికంగా వెంట్రుకలు రాలడానికి దారితీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు హీట్​ స్టైలింగ్​ సాధనాల వినియోగాన్ని తగ్గించడం మంచిది. వాటికి బదులుగా అవసరమైనప్పుడు వేడి రహిత స్టైలింగ్ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.

సరైన నిద్ర: హెయిర్ ప్రాబ్లమ్స్​తో ఇబ్బంది పడుతున్నట్లయితే రోజూ తగినంత నిద్ర పోయేలా చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే నిద్రలేమి కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. కాబట్టి డైలీ ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఇవన్నీ ఫాలో అయినా మీరు జుట్టు విపరీతంగా ఊడుతున్నట్లయితే సంబంధిత వైద్యుడిని సంప్రదించి అందుకు గల కారణాలు తెలుసుకొని దాని నివారణకు ప్రయత్నించడం మంచిది అంటున్నారు నిపుణులు.

జుట్టు విపరీతంగా రాలుతోందా? అయితే ఈ లోపాలు మీలో ఉన్నట్లే!

Hair Transplant Safe Or Not : బట్టతలపై హెయిర్​ ట్రాన్స్​ప్లాంట్​ చేయించడం సురక్షితమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.