తెలంగాణ

telangana

మ్యాజిస్టిక్ ఎడ్వంచర్​ - అద్భుతమైన విజువల్స్​తో నాగబంధం సీక్రెట్ ట్రెజర్! - Ugadi Tollywood

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 9:10 PM IST

టాలీవుడ్​కు సంబంధించి పలు సినిమా వార్తలను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇందులో వెంకటేశ్ అనిల్ రావిపూడి, గోపిచంద్, అభిషేక్ నామా చేస్తున్న చేస్తున్న కొత్త చిత్రాల వివరాలు ఉన్నాయి.

మ్యాజిస్టిక్ ఎడ్వంచర్​ - అద్భుతమైన విజువల్స్​తో నాగబంధం సీక్రెట్ ట్రెజర్!
మ్యాజిస్టిక్ ఎడ్వంచర్​ - అద్భుతమైన విజువల్స్​తో నాగబంధం సీక్రెట్ ట్రెజర్!

Venkatesh Anil Ravipudi Movie : విక్టరీ వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా రెడీ అవుతోంది. ఈ కాంబినేషన్​లో రానున్న మూడో చిత్రాన్ని తాజాగా అఫీషియల్​గా అనౌన్స్ చేశారు మేకర్స్. వెంకీఅనిల్3 అనే వర్కింగ్ టైటిల్​తో ఎఫ్2, ఎఫ్3ను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్సే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎంటర్‌టైన్‍మెంట్ పంచేందుకు మళ్లీ అద్భుతమైన కాంబో వచ్చేస్తోంది. ఎస్‍వీసీ బ్యానర్​లో విక్టరీ వెంకటేశ్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొట్టేందుకు చేతులు కలిపారు అంటూ రాసుకొచ్చారు మేకర్స్. మాజీ పోలీస్, మాజీ గర్ల్ ఫ్రెండ్, అద్భుతమైన భార్య ఈసారి అద్భుతమైన ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌తో వచ్చేస్తున్నారు అంటూ వీడియో కూడా షేర్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Gopichand Bheema Movie OTT : మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా భీమా మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ అనుకున్న స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్​కు రెడీ అయింది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‍ కానుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ నేడు (ఏప్రిల్ 9) అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. కాబట్టి థియేటర్లలో మిస్ అయిన వారు ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.

Nagabandham Abhishek Nama : దర్శకనిర్మాత అభిషేక్ నామా మరో కొత్త సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యారు. నాగబంధం అనే డిఫరెంట్ కాన్సెప్ట్​తో రానున్నారు. సీక్రెట్ ట్రెజర్ ట్యాగ్​ లైనన్. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజై ఆసక్తిని పెంచింది. పురాణాలతో కూడిన పీరియడ్ అడ్వెంచర్ మూవీగా ఇది రానుంది. టైటిల్ గ్లింప్స్ అయితే మంచి ఇంట్రెస్టింగ్‍గా, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కింది. బ్యాక్‍గ్రౌండ్‍ మ్యాజిక్​ కూడా ఇంటెన్సివ్​గా ఉంది. అభీ మ్యూజిక్ అందించారు. సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. మధుసూదన్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది.


విజయ్ కోసం ఈ ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో? - Gowtam Tinnanuri Vijay Devarakonda

'కల్కి'పై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్​ - ఆ స్థాయిలో లేరంటూ! - Prabhas Kalki 2898 AD

ABOUT THE AUTHOR

...view details