తెలంగాణ

telangana

టాలీవుడ్‌కు ఈరోజు ఎందుకంత స్పెషలో తెలుసా? - May 9th Release Movies

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 11:36 AM IST

Tollywood May 9th Release Movies : టాలీవుడ్​కు ఉన్న చాలా సెంటిమెంట్స్​లో మే 9 డేట్​ కూడా ఒకటి. దాని గురించే ఈ కథనం.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Tollywood May 9th Release Movies :మన సినిమాలకు అనుకూలంగా ఉండే సీజన్లు పండగ సెలవులు, వేసవి సెలవులు. దసరా, సంక్రాంతికి విడుదల అయితే ఒక వారం రోజులు కంటెంట్​తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయనే ధీమా నిర్మాతలకు ఉంటుంది. అయితే వేసవి సెలవులు ఇందుకు కాస్త భిన్నంగా ఉంటాయి. ఎక్కువ రోజుల సెలవులు కాబట్టి కంటెంట్​తో పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా గత 30 సంవత్సరాలుగా మే 9న విడుదలైన కొన్ని సినిమాలు ఇండస్ట్రి హిట్స్​గా నిలిచి టాలీవుడ్ స్థాయిని పెంచాయి. ఆ మూవీ ఏంటో చూసేద్దాం.
1. జగదేక వీరుడు అతిలోక సుందరి(1990) : 1990 మే 9న చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దూకుడుకు ఎండలు కూడా ఆడియెన్స్​ను థియేటర్లకు వెళ్లకుండా ఆపలేకపోయింది. రూ.2 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.15 కోట్లు కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రి హిట్​గా మారింది. ఇదే మూవీ హిందీలో మిస్టర్ ఇండియా పేరుతో రీమేక్ చేశారు.
2. గ్యాంగ్ లీడర్ : 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్ కూడా చిరంజీవి మార్కెట్ పెంచింది. విజయశాంతి హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో బప్పి లహరి సంగీతం ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్​లో ఉంటూ డ్యాన్స్ మూమెంట్స్​లో చిరంజీవికి ఎవరు సాటి లేరు అని నిరూపించింది.


3. ప్రేమించుకుందాం రా (1997): ఈ సినిమాలో ఒక సీన్ వల్ల లిటిల్ హార్ట్ బ్రాండ్ సేల్స్ బాగా పెరిగాయి అంటేనే ఇందులో ఆ సీన్​కు ఎంతగా ఆడియెన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్​, అంజలా జవేరి హీరోహీరోయిన్లగా 1997 మే 9న విడుదలైన ఈ చిత్రం వెంకటేశ్​ కెరీర్​ను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ముఖ్యంగా లవ్, ఫ్యాక్షన్ కలిపిన కథాంశంతో తెరకెక్కడం అప్పటి ఆడియెన్స్​కు ఫ్రెష్​గా అనిపించింది.
4.సంతోషం(2002) : నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియ హీరో హీరోయిన్లగా నటించిన సంతోషం కూడా మే 9 న విడుదలయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాదు నాగార్జునకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సంగీతం అందించిన ఆర్ పి పట్నాయక్ కు కూడా ఫిల్మ్ ఫేర్ దక్కింది.


5. మహానటి(2018) : అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి రూ.83కోట్ల కలెక్షన్లు సాధించి బయోపిక్స్​లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మూవీకి కీర్తి సురేశ్​కు జాతీయ అవార్డు కూడా దక్కింది.
6. మహర్షి(2029) :రైతుల సమస్యలను కళ్లకుకడుతూ వ్యవసాయ రంగ ప్రాధాన్యతను చూపించిన మహేశ్​ మహర్షి కూడా 2019లో ఇదే రోజున విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను అందుకుంది. జాతీయ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నిలిచింది. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం కూడా నేషనల్ అవార్డును అందుకున్నారు. ఇవేకాకుండా తమిళ డబ్బింగ్ సినిమా భారతీయుడు కూడా 1996 మే 9న విడుదలై సంచలనం సృష్టించింది. మే 9న ప్రభాస్ కల్కి కూడా విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

బుజ్జితల్లి ఫ్యాన్స్‌కు 'తండేల్' టీమ్ సర్​ప్రైజ్​ వీడియో - Happy Birthday Sai pallavi

తండ్రి అడిగిన ఆ ఒక్క ప్రశ్న - రౌడీహీరోను సినిమాల్లోకి వెళ్లేలా చేసిందట! - Happy Birthday Vijay Devarkonda

ABOUT THE AUTHOR

...view details