ETV Bharat / entertainment

తండ్రి అడిగిన ఆ ఒక్క ప్రశ్న - రౌడీహీరోను సినిమాల్లోకి వెళ్లేలా చేసిందట! - Happy Birthday Vijay Devarkonda

author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 7:39 AM IST

ETV Bharat
Vijay Devarkonda (ETV Bharat)

Happy Birthday Vijay Devarkonda : మొదటి నుంచి సినిమాల్లో రాణించాలని అనుకున్న విజయ్ దేవరకొండను తన తండ్రి అడిగిన ఆ ఒక్క ప్రశ్న - సినిమా అవకాశాల విషయంలో మరింత ముందుకెళ్లేలా చేసిందట. నేడు విజయ్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

Happy Birthday Vijay Devarkonda : బ్యాక్​గ్రాండ్​ ఉంటేనే సినిమాల్లో రాణించగలము అని అనుకునే రోజుల్లోనే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకుని తామెంటో నిరూపించుకున్నారు కొందరు నటులు. అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. ఒక్క ఛాన్స్‌ అంటూ నిర్మాతల చుట్టూ తిరిగే స్థాయి నుంచి తనతో సినిమాలు చేసేందుకు భారీ నిర్మాణ సంస్థలు ముందుకొచ్చేంతగా ఎదిగారు. స్టార్ అవ్వాలంటే హీరోగానే ఎంట్రీ ఇవ్వాలా ఏంటీ అన్నట్లుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు ఎంతో మంది యూత్​కు ఇన్​స్పిరేషన్​గా నిలిచారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కెరీర్ ప్రారంభించి, అనతికాలంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్​లో దూసుకెళ్తున్నారు. అయితే అసలు ఈ రౌడీ బాయ్ సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారంటే?

విజయ్ తండ్రి గోవర్ధన రావుకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. అదే ఆశతో ఆయన తన సొంతూరు వదిలి హైదరాబాద్‌ చేరుకున్నారు! ఇక హీరో అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు ఆయన టెలివిజన్‌ డైరెక్టర్​గా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని పర్సనల్ కారణాల వల్ల తన ప్రొఫెషన్​ను మార్చుకున్నారు.

అయితే విజయ్ దేవరకొండ మాత్రం డిగ్రీ పూర్తయ్యాక సినిమాల్లోకి రావాలనే తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో బీకామ్‌ పూర్తి చేసిన విజయ్​ను తన తండ్రి ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో జాయిన్ చేశారు. కానీ అక్కడ విజయ్​ ఎక్కువగా నాటకాలు మాత్రమే చేస్తుంటేవారు. దీంతో గోవర్ధన రావు "ఇంకెన్నాళ్లు ఇలా? సినిమాల్లోకి వెళ్లవా?" అంటూ తన కొడుకును ప్రశ్నించారు. దీంతో ఆలోచించిన విజయ్ సినిమా అవకాశాలను వెతుక్కుంటూ బయలుదేరారు.

అలా ట్రై చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన 'నువ్విలా' సినిమాలో ఛాన్స్ దక్కింది. అదే టైమ్​లో శేఖర్‌ కమ్ముల 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' సినిమా ఆడిషన్స్‌లోనూ పాల్గొని అజయ్‌ పాత్రకు ఎంపికయ్యారు. కానీ తొలి రెండు సినిమాల్లో విజయ్ చేసిన పాత్రలు అంతగా క్లిక్ అవ్వలేదు. కానీ విజయ్ ఏ మాత్రం నిరాశ చెందలేదు.

అప్పుడే నేచురల్ స్టార్ నాని నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' రిలీజైంది. ఈ చిత్రానికి అంతగా కలెక్షన్స్ రానప్పటికీ మంచి టాక్ మాత్రం వచ్చింది. ముఖ్యంగా ఇందులో రిషి పాత్రతో మెరిసిన విజయ్​పై అందరి దృష్టి పడింది. చేసింది చిన్న రోలే అయినప్పటికీ తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అలా తరుణ్‌ భాస్కర్‌ 'పెళ్లి చూపులు' సినిమాలో లీడ్ రోల్​ అందుకున్నారు. హీరోగా కాస్త పేరు తెచ్చుకున్నారు. కానీ మొదట ఈ చిత్రంలో విజయ్​ను హీరోగా పెట్టి సినిమాను నిర్మించేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు రాలేదట. చివరకు రాజ్‌ కందుకూరి విజయ్‌ను నమ్మి ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక థియేటర్లలో విడుదలైన ఆ సినిమా మంచి టాక్​తో పాటు బాక్సాఫీస్ వద్ద సక్సెస్​ సాధించింది. దీంతో విజయ్ రేంజ్ కాస్త మారింది.వరుస ఆఫర్లు ఈ రౌడీ హీరోను వరించాయి.

అనంతరం వచ్చిన 'ద్వారక' నిరాశపరచగా, 'అర్జున్‌రెడ్డి'తో మళ్లీ తానేంటో నిరూపించుకున్నారు విజయ్. స్టార్ స్టేటస్​ను అందుకున్నారు. ఇక అప్పటి నుంచి ఫలితాలతో సంబంధం లేకుండా అభిమానులను అలరించేందుకు కొత్త కొత్త కాన్సెప్ట్స్​ ఉన్న సినిమాల్లో కనిపించి అలరిస్తూ వస్తున్నారు..

విజయ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు :

  • 2018లో అర్జున్ రెడ్డి సినిమాకుగానూ విజయ్​కు ఫిల్మ్​ఫేర్ అవార్డు వచ్చింది. అయితే 2019 లో ఆ అవార్డును అమ్మేశారు. దాని వల్ల వచ్చిన మొత్తాన్ని సిఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు.
  • విజయ్​కు రౌడీ అనే పేరుతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇందులో తన ఫ్యాన్స్ కోసం షర్ట్స్​, స్టోర్ట్స్ వేర్, షూస్ ఇలా పలు రకాల దుస్తులను అందుబాటులోకి తెచ్చారు.
  • కెరీర్‌ ప్రారంభంలో తాను పడిన కష్టం ఇతర నటులు పడకూడదనే ఉద్దేశంతో నిర్మాతగా మారారు. 'కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' అనే సంస్థను నెలకొల్పి అందులో 'మీకు మాత్రమే చెప్తా', 'పుష్పక విమానం' లాంటి సినిమాలను నిర్మించారు.
  • 2019లో ది దేవరకొండ ఫౌండేషన్​ను స్థాపించి ఎంతో మందికి సహాయం కూడా చేశారు.
  • ఇన్​స్టాగ్రామ్​లో 5 మిలియన్ మార్క్ సాధించిన తొలి తెలుగు హీరోగా రికార్డుకెక్కారు.
  • 2021లో ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన మోస్ట్ ఇన్​ఫ్లూయెన్షల్ యాక్టర్స్​లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ లిస్ట్​లో యశ్​, అల్లు అర్జున్ లాంటి స్టార్స్​ను అధిగమించారు.

మైత్రీ మేకర్స్ కొత్త మూవీ అనౌన్స్​మెంట్ - విజయ్ హీరోగా! - Mythri Movie Makers New Movie

దిల్ రాజుతో పెద్ద గొడవ - కాళ్లు పట్టేసుకున్న సుకుమార్! - Dil Raju Sukumar

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.