తెలంగాణ

telangana

ఈ వారమే కింగ్ కాంగ్ వర్సెస్ డీజే టిల్లు - ​OTTలో రానున్న మరో 15 సినిమాలు ఏంటంటే? - This Week Release Movies OTT

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 11:28 AM IST

This Week Release Movies OTT : ఈ వారం సినీ ప్రియుల్ని అలరించేందుకు ఏకంగా 16 సినిమా సిరీస్​లు రానున్నాయి. ఆ వివరాలు.

ఈ వారమే డీజే టిల్లు వర్సెస్ కింగ్ కాంగ్ - ​OTTలో రానున్న మరో 15 సినిమాలు ఏంటంటే?
ఈ వారమే డీజే టిల్లు వర్సెస్ కింగ్ కాంగ్ - ​OTTలో రానున్న మరో 15 సినిమాలు ఏంటంటే?

This Week Release Movies OTT :ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు వచ్చేందుకు రెడీ అయిపోయాయి. కొన్నేమో థియేటర్లలో రిలీజ్ అవుతుండగా, మరికొన్ని ఓటీటీలో విడుదల కానున్నాయి. వాటిలో సలార్ ఫేమ్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ఆడు జీవితం ది గోట్‌లైఫ్‌ ఒకటి(Aaadujeevitham The Goat Life). సర్వైవల్‌ డ్రామాగా ఇది రానుంది. మార్చి 28న విడుదల కానుంది.

సూపర్ హిట్ చిత్రం డీజే టిల్లుతో స్టార్(DJ Tillu Release Date) స్టేటస్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు దానికి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్‌తో రాబోతున్నారు. యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ బోల్డ్ రోల్​లో నటించింది. మార్చి 29న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు యూత్​ను బాగా ఆకట్టుకున్నాయి.

అటు గాడ్జిల్లా, ఇటు కింగ్‌కాంగ్‌ ఒకదానిపై ఒకటి విరుచుకుపడితే ఎలా ఉంటుందో తెలుసు కదా - అలాంటి విజువుల్‌ ట్రీట్‌నే అందించేందుకు వచ్చేస్తోంది గాడ్జిల్లా vs కాంగ్ : ది న్యూ ఎంపైర్‌(Godzilla x Kong: The New Empire). ఇంగ్లిష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ మార్చి 29న రిలీజ్ కానుంది.

ఈ వారం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రాలివే!

ఆహాలో

వైవా హర్ష సుందరం మాస్టర్(Viva Harsha Sundaram Master)​ - మార్చి 28

ఈటీవీ విన్​లో

విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని - ఏం చేస్తున్నావ్‌? - ఆగస్టు 25నుంచి

నెట్‌ఫ్లిక్స్​లో(Neflix This week releases)

టెస్టామెంట్‌ (వెబ్‌సిరీస్) మార్చి 27

ది బ్యూటిఫుల్‌ గేమ్‌ (హాలీవుడ్‌) మార్చి 29

హార్ట్‌ ఆఫ్‌ ది హంటర్‌ (హాలీవుడ్) మార్చి 29

ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో (హిందీ) మార్చి 30

అమెజాన్‌ ప్రైమ్​లో

టిగ్‌ నొటారో (వెబ్‌సిరిస్‌)మార్చి 26

ది బాక్స్‌టర్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 28

డిస్నీ+హాట్‌స్టార్​లో(Disney Hot star this week releases)

ట్రూ లవర్​ - మార్చి 27

రెనెగడె నెల్ల్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 29

పట్నా శుక్లా (హిందీ)మార్చి 29

బుక్‌ మై షోలో

ది హోల్డోవర్స్‌ (హాలీవుడ్‌) మార్చి 29

జియో సినిమాలో

ఎ జెంటిల్‌మ్యాన్‌ ఇన్‌మాస్క్‌ (వెబ్‌సిరీస్‌)మార్చి 29

'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారేంటి? - Kalki 2898 Ad kamal Haasan

కళ్లు చెదిరిపోయాయి వర్మ - 53ఏళ్ల వయసులో రమ్యకృష్ణ అందాలు వేరే లెవల్​! - Ramya Krishna photoshoot

ABOUT THE AUTHOR

...view details