తెలంగాణ

telangana

కారు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి - నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందే! - Road Accident In Bilaspur

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 5:08 PM IST

Road Accident In Bilaspur : విలన్ పాత్రలో పెరొందిన ప్రముఖ నటుడు సూరజ్ మెహర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అది కూడా నిశ్చితార్ధానికి కొద్ది గంటల ముందే ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఛత్తీస్​గఢ్​లో ఈ ఘటన జరిగింది.

Road Accident In Bilaspur
Road Accident In Bilaspur

Road Accident In Bilaspur : ఛత్తీస్​గఢ్​లో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సూరజ్ మెహర్​(40) మరణించారు. బిలాస్​పుర్ సమీపంలో ఓ ట్రక్కును సూరజ్​ ప్రయాణిస్తున్ కార ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సూరజ్ మరణించగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే సూరజ్​కు గురువారం నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ జరిగింది
బిలాసపుర్​లోని సెందారి గ్రామంలో ఓ రైస్​ మిల్​లో 'ఆఖిరీ ఫైస్లా' అనే సినిమా షూటింగ్​ జరుగుతోంది. ఈ సినిమాలో సూరజ్​ నటిస్తున్నారు. గురువారం ఒడిశాలో సూరజ్​కు నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. దీంతో బుధవారం షూటింగ్​ పూర్తి చేసుకున్న తర్వాత అర్ధరాత్రి ఇంటికి కారులో బయలుదేరారు. సూరజ్​తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నారు. అయితే బిలాయిగఢ్ సమీపంలో ట్రక్కును కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ముందు కూర్చున్న సూరజ్ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్​ సహా మరో వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

నిశ్చితార్ధానికి కొద్ది గంటల ముందే ప్రమాదంలో సూరజ్ మరణించడం వల్ల ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆయన అభిమానులు , ఛత్తీస్​గఢ్ చిత్ర పరిశ్రమ సూరజ్ మెహర్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆఖిరీ ఫైస్లా చిత్రంలో నటిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలతో సూరజ్​ మెహర్ బాగా ఫేమస్ అయ్యారు.

టాలీవుడ్ కమెడియన్ విశ్వేశ్వరరావు మృతి
ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వేశ్వరరావు మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 350కి పైగా నటించిన ఈయన, టీవీ సీరియల్స్ లో కమెడియన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా కూడా కనిపించారు. కేవలం బాలనటుడిగానే దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవల కొద్ది కాలంగా విస్సు టాకీస్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు విశ్వేశ్వరరావు. అందులో తన సినీ అనుభవాలు, కష్టాలు పంచుకుంటూ నేటితరానికి కూడా చేరువయ్యారు.

ముంబయి 'వార్'​లో దిగిన ఎన్టీఆర్​ - పది రోజులు అక్కడే! - War 2 Shooting

యాక్షన్​ మోడ్​లో గోపిచంద్, శ్రీనువైట్ల టైటిల్ గ్లింప్స్​ - అందర్నీ చంపేసి బిర్యానీ తింటూ - Gopichand SrinuVaitla Movie

ABOUT THE AUTHOR

...view details