ETV Bharat / entertainment

ముంబయి 'వార్'​లో దిగిన ఎన్టీఆర్​ - పది రోజులు అక్కడే! - War 2 Shooting

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 4:06 PM IST

Updated : Apr 11, 2024, 4:57 PM IST

ముంబయి వార్​లో దిగిన ఎన్టీఆర్​ - పది రోజులు అక్కడే!
ముంబయి వార్​లో దిగిన ఎన్టీఆర్​ - పది రోజులు అక్కడే!

NTR Hrithik Roshna War 2 Shooting : యంగ్ టైగర్ ఎన్టీఆర్​ వార్ 2 షూటింగ్ కోసం ముంబయికి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమారు 10 రోజుల పాటు వార్‌ షూటింగ్‌లో పాల్గొననున్నారని తెలిసింది.

NTR Hrithik Roshna War 2 Shooting : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో యంగ్​ ఎన్టీఆర్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి హృతిక్, ఎన్టీఆర్ కలిసి షూటింగ్​లో పాల్గొన్న అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. అయితే ఇప్పటికీ అభిమానుల ఆశ తీరనుంది. ఒక 10 రోజుల యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ తాజాగా ముంబయికి చేరుకున్నారు. ఏప్రిల్ 12 నుంచి షూటింగ్​ సెట్స్​లో తారక్ అడుగుపెట్టనున్నారట. అయితే ముంబయికి చేరుకోగానే మీడియా ఎన్టీఆర్​ను చుట్టుముట్టేసింది. ఫ్యాన్స్ అంతా ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. కానీ తారక్​ దూరం నుంచే వాళ్లను చూసి ఫొటోలకు పోజులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక ఎన్టీఆర్ నటించనున్న ఈ యాక్షన్ సీన్స్ సినిమాకు చాలా ముఖ్యమైన సీన్స్ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి హృతిక్, తారక్ ఇద్దరూ వంద రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ 10 రోజుల షూటింగ్ తర్వాత మళ్లీ తన షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ ముంబకు వస్తారా లేదా ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఆ కాల్ షీట్స్ ఇచ్చారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రం కోసం హృతిక్, తారక్ ఇద్దరూ వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది తేలాల్సి ఉంది. మూవీలో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్​గా కనిపించనున్నారట. హృతిక్​తో పాటు ఎన్టీఆర్ పాత్రకు కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.

కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ చివరకి దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్​ఆర్​ఆర్​ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్​గా మారిపోయారు. అందుకే హిందీ ఆడియెన్స్​ను ఆకట్టుకోవడానికి దేవర సినిమాలో హీరోయిన్​గా జాన్వీ కపూర్​తో పాటు కీలక పాత్రలో సైఫ్ అలీ ఖాన్​ను తీసుకున్నారు. వార్ 2 ప్రస్తుత షెడ్యూల్ పది రోజులు పూర్తి కాగానే మళ్లీ దేవర షూటింగ్​లో పాల్గొంటారు ఎన్టీఆర్.

యాక్షన్​ మోడ్​లో గోపిచంద్, శ్రీనువైట్ల టైటిల్ గ్లింప్స్​ - అందర్నీ చంపేసి బిర్యానీ తింటూ - Gopichand SrinuVaitla Movie

సమంత సైలెంట్ బ్లాస్ట్ - సోషల్ మీడియా షేక్​! - Samantha Upcoming Movies

Last Updated :Apr 11, 2024, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.