తెలంగాణ

telangana

'డాక్టర్' ​చరణ్​కు పవర్​స్టార్ స్పెషల్ విషెస్- ఆయన రియాక్షన్ ఇదే! - Ram Charan Pawan Kalyan

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 3:55 PM IST

Updated : Apr 12, 2024, 4:52 PM IST

Ram Charan Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​కు డాక్టరేట్ దక్కడం పట్ల టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్​ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.

Ramcharan Doctorate
Ramcharan Doctorate

Ram Charan Pawan Kalyan:గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​కు గౌరవ డాక్టరేట్ దక్కడం పట్ల టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్​ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా ఆయనకు అభినందనలు తెలిపారు.'చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషంగా ఉంది. చరణ్‌కు ఉన్న ప్రేక్షకాదరణ, అతడు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలను గుర్తించి తమిళనాడులోని వేల్స్‌ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని ప్రకటించడం ముదావహం. ఈ స్ఫూర్తితో అతడు మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని, మరెన్నో పురస్కారాలు, మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా' అని పేర్కొన్నారు.

కాగా, చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు రీసెంట్​గా డాక్టరేట్​ ప్రకటించింది. ఏప్రిల్ 13న జరగనున్న వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే ఆల్​ ఇండియా కౌన్సిల్ ఆఫ్​ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చరణ్​కు గౌరవ డాక్టరేట్‌ అందించనున్నారు.

ఇక ప్రస్తుతం రామ్​చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. పొలిటికల్​ యాక్షన్​ జానర్​లో డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రామ్​చరణ్ సరసన బాలీవుడ్ బ్యాటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. వీరితోపాటు నటి అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్​రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్​పై శిరీష్​తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత చెర్రీ 'ఉప్పెన' ఫేమ్‌ బుచ్చిబాబుతో జతకట్టనున్నారు. ఈ సినిమాలో అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె శ్రీదేవి హీరోయిన్​గా నటించనుంది. ఈ సినిమా గతనెల పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

ఇకపై 'డాక్టర్' రామ్​ చరణ్- ప్రముఖ యూనివర్సిటీ నుంచి చెర్రీకి డాక్టరేట్ - Ram Charan Honorary Doctorate

ఏనుగు పిల్లకు స్నానం చేయించిన బుజ్జి క్లీంకార- థాయ్​లాండ్​లో ఎంజాయ్ చేసిన చెర్రీ ఫ్యామిలీ ! - Ram Charan Family Trip

Last Updated : Apr 12, 2024, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details