తెలంగాణ

telangana

రాజమౌళి - మహేశ్​ సినిమాలో మరో స్టార్ హీరో? - Rajamouli Mahesh Babu Movie

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 3:07 PM IST

Rajamouli Mahesh Babu Movie : పాన్ వరల్డ్ సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ SSMB 29​లో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాటు మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

రాజమౌళి - మహేశ్​ సినిమాలో మరో స్టార్ హీరో?
రాజమౌళి - మహేశ్​ సినిమాలో మరో స్టార్ హీరో?

Rajamouli Mahesh Babu Movie : బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ స్థాయికి తెలుగు సినిమాను తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేశ్​ బాబుతో SSMB 29 సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, అప్డేట్స్​ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

అయితే తాజాగా మరో అదిరిపోయే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ జక్కన్న సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు జోరుగా ప్రచారం మొదలైంది. కొద్ది రోజులు క్రితం రాజమౌళి ముంబలో సైలెంట్​గా అమీర్ ఖాన్​ను కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

కొంత కాలం క్రితం కూడా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ హీరో నెగటివ్ రోల్​లో నటించనున్నారని మీడియాలో బాగా ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు రాజమౌళి అమీర్ ఖాన్​ను(Rajamouli Aamir Khan) కలవడం వల్ల ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మూవీ టీమ్ అఫీషియల్​గా అనౌన్స్ చేసే వరకు వేచి ఉండాల్సిందే.

ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్​లో ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ సెట్స్​పైకి వెళ్లనుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోవడానికి కనీసం మరో రెండేళ్లు పడుతుందని తెలుస్తోంది. అంటే చివరగా గుంటూరు కారంతో కనిపించిన మహేశ్ బాబు కూడా మరో రెండు మూడేళ్ల వరకు థియేటర్లలో సందడి చేసే ఛాన్సే లేదు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్​తో అత్యున్నత సాంకేతికతో తెరకెక్కిస్తున్నారని తెలిసింది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్​డ్రాప్​తో అడ్వెంచర్ థ్రిల్లర్​గా సినిమాను నిర్మించనున్నారు.

ఇకపోతే అమీర్ ఖాన్ విషయానికి వస్తే ఆయన చివరిగా నటించిన లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ పూర్తిగా నిరాశ పరిచింది. దీని తర్వాత ఆయన మరో చిత్రాన్ని ప్రకటించలేదు. ఆ మధ్యలో కొంత కాలం పాటు షూటింగ్​లకు బ్రేక్ కూడా ఇచ్చారు. ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. చూడాలి మరి జక్కన్న సినిమాలో నటిస్తారో లేదో.

'పుష్ప' టీజర్ - బన్నీ డెడికేషన్ అలా ఉంటుంది మరి!​ - Allu Arjun Pushpa 2 Teaser

'దేవర' రిలీజ్ ఆలస్యమైనా మీరందరూ కాలర్ ఎగరేస్తారు'- ఫ్యాన్స్​లో జోష్ నింపిన ఎన్టీఆర్ - Jr NTR Devara

ABOUT THE AUTHOR

...view details