తెలంగాణ

telangana

కేన్స్​లో 'కన్నప్ప' - టీజర్ లాంఛ్​కు మేకర్స్ భారీ ప్లాన్స్​ - Kannappa Movie

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 5:43 PM IST

Kannappa Teaser Release : టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్​ ప్రాజెక్ట్ 'కన్నప్ప'కు సంబంధించిన టీజర్​ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.

Kannappa Teaser Release
Kannappa Teaser Release (Source : ETV Bharat Archives)

Kannappa Teaser Release :టాలీవుడ్ నటుడు మంచు విష్ణు టైటిల్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప'. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే రోజుకో సర్​ప్రైజ్ ఇస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ మూవీ టీమ్​. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన అప్​డేట్ వచ్చింది.

'కన్నప్ప' టీజర్ ను ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ ఫెస్టివల్​లో లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించారు మూవీ మేకర్స్. ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ నెల 20న జరగనున్న ఈ ఈవెంట్​లో సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ టీజర్​ను విడుదల చేస్తున్నట్లు అందులో రాసుంది.

ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైందని సెట్స్​లోకి ప్రభాస్ అడుగు పెట్టారన్న సంగతి విష్ణు బయట పెట్టగానే ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే కన్నప్పలో ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి ఇతరుల పాత్రల గురించి, కథ గురించీ మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం బయటపెట్టలేదు చిత్ర యూనిట్. మరోవైపు సినిమాలో అంతా పెద్ద పెద్ద స్టార్లే నటిస్తున్నందున కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు. కాగా మే 20న విడుదల కానున్న టీజర్​లో అయినా వీరి లుక్ లేదా పాత్రల పేర్లు లాంటివి రివీల్ అవుతాయోమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

ఇక 'కన్నప్ప' సినిమాను డైరెక్టర్ ముకేశ్ కుమార్‌ సింగ్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్​లో రూపొందుతున్న ఈ చిత్రంలో లీడ్ రోల్​లో హీరో మంచు విష్ణు మెరవనున్నారు. ఈయనతో పాటు మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, శరత్‌కుమార్‌, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. దాదాపు 800 మంది సిబ్బందితో 5 నెలల పాటు శ్రమించి ఈ చిత్రానికి సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌ పూర్తి చేయించినట్లు ఇటీవలే హీరో విష్ణు చెప్పారు. ఈ సినిమా అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు.

'కన్నప్ప' సెట్స్​లోకి ప్రభాస్ ఎంట్రీ- నందీశ్వరుడి పాత్రేనా? - Kannappa Movie Shooting

'కన్నప్ప' సినిమాలో బాలీవుడ్ హీరో - అక్షయ్ తెలుగు​ డెబ్యూ ఇదే! - Akshay Kumar Kannappa Movie

ABOUT THE AUTHOR

...view details