తెలంగాణ

telangana

ఓటీటీలో కన్నా ముందే టీవీలోకి హనుమాన్ మూవీ- ఏ ఛానల్​లో అంటే?

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 10:07 PM IST

Updated : Mar 8, 2024, 10:36 PM IST

Hanuman Movie TV Release Date : బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన హనుమాన్‌ మూవీ ఓటీటీ కన్నా ముందే టీవీలో ప్రసారం కానుంది. ఏ ఛానల్‌లో? ఎప్పుడంటే?

Hanuman Movie TV Release Date
Hanuman Movie TV Release Date

Hanuman Movie TV Release Date :2024 సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబట్టి లాభాలు కురిపించింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ మూవీ ఓటీటీ కన్నా ముందే టీవీలో ప్రసారం కానుంది. మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానల్‌, జియో సినిమాలో కేవలం హిందీలో టెలికాస్ట్‌ అవుతుంది. ఈ వివరాలను కలర్స్‌ సినీప్లెక్స్‌ సంస్థ తమ సోషల్‌ మీడియా ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దాన్ని రీట్వీట్‌ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది.

మార్చి 2 నుంచి జీ 5లో హనుమాన్‌ స్ట్రీమింగ్‌ అవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత మార్చి 8న విడుదలవుతుందని టాక్‌ వినిపించింది. దీంతో కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో జీ5 సంస్థ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని కోరారు. దానిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

దీంతో మరోసారి ఈ చిత్రం కోసం ఎదురుచూసే వారికి నిరాశే ఎదురైంది. ఈ సినిమాను రూ.40 కోట్లతో నిర్మించగా ఇప్పటివరకు రూ.330 కోట్లు వసూలు చేసింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల చిత్రబృందం ఘనంగా ఈవెంట్‌ను నిర్వహించింది. మంచి సినిమాపై ప్రేక్షకులు చూపే అభిమానం ఎంతటి కష్టాన్ని అయినా మరిపిస్తుందన్నారు.

హనుమాన్‌ అద్భుత విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హనుమంతుగా మెప్పించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, అమృత అయ్యర్‌, సముద్రఖని, వినయ్‌రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటించారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

టాలీవుడ్​లో సీక్వెల్స్​ పర్వం - మరీ ఆ రెండు సినిమాల సంగతేంటి ?

30 రోజులు - 300 సెంటర్లు- హిందీ బాక్సాఫీస్ వద్ద 'హనుమాన్' అరుదైన రికార్డు

Last Updated :Mar 8, 2024, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details