ETV Bharat / entertainment

టాలీవుడ్​లో సీక్వెల్స్​ పర్వం - మరీ ఆ రెండు సినిమాల సంగతేంటి ?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 3:56 PM IST

Sequel Movies In Tollywood : ఓ సినిమాను ఒకే పార్ట్​గా తీసి ముగిస్తే అందులో కిక్​ ఏముందని అనుకుంటున్నారేమో ఇప్పటి డైరెక్టర్లు. అందుకే ప్రేక్షకులలో ఆసక్తి రేపేందుకు ఒక సినిమాను రెండు లేదా మూడు పార్టులుగా తెరకెక్కించేందుకు సిద్ధమౌతున్నారు. అలా బాహుబలి, కేజీఎఫ్ థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఇప్పుడు 'పుష్ప', 'సలార్', 'హనుమాన్' లాంటి సినిమాలు సీక్వెల్స్​గా వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా డైరెక్టర్లు తమ స్టోరీలను పట్టాలెక్కించి మెరుగులు దిద్దుతున్నారు. అయితే వీటిలాగే 'పెదకాపు -1', 'స్కంద' వంటి సినిమాలు కూడా రెండో పార్ట్ ఉన్నాయని అప్పట్లో మేకర్స్ వెల్లడించారు. కానీ ఈ సినిమాలు ఫస్ట్ పార్ట్స్​ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. దీంతో వీరు సీక్వెల్స్​ తీస్తారా అంటే ఏమో అనే ప్రశ్న ఎదురవుతోంది.

Sequel Movies In Tollywood
Sequel Movies In Tollywood

Sequel Movies In Tollywood : వాస్తవానికి ఒకప్పుడు టాలీవుడ్​లో సినిమాలకు సీక్వెల్స్​ అంటే దానికి దాదాపు నో అనే చెప్పేవారు. సూపర్ హిట్ సినిమాలకు వచ్చిన సీక్వెల్స్ ఏవీ కూడా పెద్దగా వర్కౌట్ అయ్యేవి కాదు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాకు సీక్వెల్​గా వచ్చిన 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. అలాగే మాస్ మహారాజ రవితేజ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'కిక్' సినిమాకు సీక్వెల్​గా వచ్చిన కిక్ 2 సినిమా కూడా నిరాశగానే మిగిలింది.

గతంలో 'ఆర్య' సినిమా సీక్వెల్​గా వచ్చిన 'ఆర్య 2' కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న వసూళ్లు సాధించలేకపోయింది. ఇలా టాలీవుడ్​లో సీక్వెల్స్ పెద్దగా ఆడిన సందర్భాలు లేవు. అయితే ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ 'బాహుబలి' సినిమా సీక్వెల్ తొలి పార్ట్​ను మించిన బ్లాక్ బస్టర్​గా నిలిచింది. అలా మరోసారి సీక్వెల్స్​ పండుగను టాలీవుడ్​కు తెచ్చారు రాజమౌళి.

ఇక రాజమౌళి బాటలోనే డైరెక్టర్​ సుకుమార్ కూడా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక అదే కోవలో కేజిఎఫ్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ కూడా 'సలార్ 2'ను సిద్ధం చేస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన మాసివ్ సక్సెస్ అందుకున్న 'హనుమాన్' సినిమా కూడా 'జై హనుమాన్' ( హనుమాన్ 2), తెరకెక్కేందుకు సిద్ధమవుతోంది.

మరోవైపు సిద్దు జొన్నలగడ్డ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం డీజే టిల్లు కూడా టిల్లు స్క్వేర్ పేరిట సీక్వెల్​ను సిద్ధం చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకా 'దేవర 2', 'యానిమల్ 2' (యానిమల్ పార్క్), 'కాంతార 2', అఖండ 2, 'కల్కి 2' , 'ఓజీ2', 'గూఢచారి 2', 'హిట్ 3','ఈగల్ 2', 'సైంధవ్ 2' చిత్రాలు కూడా వస్తున్నాయి.

అయితే తమ కంటెంట్ మీదున్న నమ్మకంతో కచ్చితంగా సీక్వెల్స్​ను తెరకెక్కిస్తామని మరికొందరు మేకర్స్ మొదటి పార్ట్ ను విడుదల చేశారు. అయితే కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి. అలాంటి చిత్రాల్లో గత ఏడాది విడుదలైన 'పెదకాపు', 'స్కంద' పంటి చిత్రాలు ఉన్నాయి.

ఫస్టే టైటిల్ ఫిక్స్ - మరీ ఇప్పుడు పరిస్థితేంటి ?
పెదకాపు 1 : ఈ సినిమాను కచ్చితంగా సీక్వెల్​గా తెరకెక్కిస్తామనే ధీమాతో డైరెక్టర్ దీనికి పెదకాపు 1 అనే టైటిల్​ను ఫిక్స్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్​ అడ్రెస్​గా నిలిచే శ్రీకాంత్ అడ్డాల తొలిసారిగా ఒక యాక్షన్ ఓరియెంటెడ్ జానర్ లోకి ప్రవేశించారు. అయితే పెద్దకాపు అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ తీసేందుకు డైరెక్టర్​ ప్లాన్ చేసినప్పటికీ, తొలి సినిమా ఫలితాలు చూసి ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారా అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అలాంటి కంటెంట్ ను నమ్ముకొని సీక్వెల్ తీసే ఆలోచనలు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలకు ఉండకపోవచ్చు అని టాక్ నడుస్తోంది.

స్కంద 2 : మరోవైపు బోయపాటి కూడా తొలుత 'స్కంద 2' తీస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమా మొదటి పార్ట్ లోనే అనుకున్న వసూలు అందుకోలేకపోయింది. దీంతో నిరాశ చెందిన హీరో రామ్ సక్సెస్ బాట పట్టాలని గతంలో హిట్టు కొట్టిన ఇస్మార్ట్ శంకర్​కు సీక్వెల్​గా తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్​'లో నటిస్తున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ మొదటి పార్ట్ సూపర్ హిట్ అయింది. కానీ 'స్కంద' పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇలాంటి సమయంలో 'స్కంద పార్ట్ 2' తీసేందుకు రామ్ ఒప్పుకుంటాడా లేదా అనేది అసలు ప్రశ్న.

అంతకన్నా ముందు డైరెక్టర్ బోయపాటి కూడా తాను గతంలో హిట్ ఇచ్చిన 'అఖండ' సినిమాకు సీక్వెల్ తీయడం పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ అందుకున్న వెంచర్​ను ముందుకు తీసుకెళ్లేందుకు సాధారణంగా డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఆలోచిస్తారు. ఆరంభంలోనే ఫెయిల్యూర్ మూటగట్టుకున్న ప్రాజెక్టును సీక్వెల్ తీయాలని అనుకోవడం పొరపాటే అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Skanda Movie Review : రామ్‌-బోయపాటి కాంబినేషన్‌ మెప్పించిందా?

Peddha Kapu 1 Movie Review : సామాన్యుడి సంతకం 'పెదకాపు-1'.. మూవీ ఎలా ఉందంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.