తెలంగాణ

telangana

బుల్లితెరపైకి రూ.600 కోట్ల బ్లాక్ బాస్టర్​ మూవీ - తెలుగు ప్రేక్షకుల కోసం స్పెషల్​గా!

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 9:17 AM IST

Updated : Feb 12, 2024, 12:01 PM IST

Gadar 2 Telugu Tv Premiere : రూ.600కోట్ల బ్లాక్ బాస్టర్ హిట్​ మూవీ టీవీ ప్రీమియర్స్​కు రెడీ అయిపోయింది. ఇంతకీ ఆ సూపర్ హిట్ సినిమా ఏంటి? ఎప్పుడు? ఏ ఛానల్​లో ప్రసారం కానుందో తెలుసుకుందాం.

Gadar 2 Telugu Tv Premiere
Gadar 2 Telugu Tv Premiere

Gadar 2 Telugu Tv Premiere : ప్రతిరోజు టీవీలో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. ప్రేక్షకులను మరింత అలరించేందుకు వీకెండ్​లో కొత్త సినిమాలు కూడా ప్రసారమవుతుంటాయి. అలా ఇప్పుడు రూ.600కోట్ల బ్లాక్ బాస్టర్ హిట్​ మూవీ టీవీ ప్రీమియర్స్​కు రెడీ అయింది. వివరాల్లోకి వెళితే. గత ఏడాది బాలీవుడ్ కమ్ బ్యాక్ భారీ లెవల్​లో జరిగింది. జనవరి నుంచే పఠాన్​తో మొదలై ఆ తర్వాత పలు చిత్రాలు మంచి హిట్​గా నిలిచాయి. అందులో రెండు ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉండటం విశేషం. అలా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపిన చిత్రాల్లో గదర్ 2 కూడా ఒకటి. బాలీవుడ్ సీనియర్ హీరో స‌న్నీదేఓల్ నటించిన ఈ చిత్రం గ‌తేడాది ఇండియా వైడ్‌గా అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన టాప్ ఫైవ్ మూవీస్​లో ఒక‌టిగా నిలిచింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించి బాలీవుడ్ సినీ హిస్టరీలో అత్య‌ధిక వసూళ్లను అందుకున్న ఎనిమిదో చిత్రంగా భారీ రికార్డ్​ను క్రియేట్ చేసింది.

రూ. 60కోట్ల బడ్జెట్​తో రూ. 691 కలెక్షన్లు
కేవ‌లం రూ.60 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం టోటల్ థియేట్రికల్​ రన్​ టైమ్​లో రూ. 691 కోట్ల‌కుపైగా కలెక్షన్లను అందుకుంది. నిర్మాత‌ల‌కు ఈ మూవీ పదింత‌ల లాభాల‌ను తెచ్చిపెట్టింది. తొలి రోజే ఈ చిత్రానికి రూ. 40 కోట్లు రాగా ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ. 134 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో లాభాల్లోకి అడుగుపెట్టేసింది. అలా మొత్తం రూ.700కోట్ల వరకు అందుకుంది.

దేశభక్తి బ్యాక్​డ్రాప్​లో ఫాదర్ అండ్​ సన్​ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో తారా సింగ్‌, సకీనాల ప్రేమకథకు ప్రేక్షకులు అంతా బాగా కనెక్ట్ అయిపోయారు. సన్నీ దేవోల్‌, అమీషా పటేల్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్‌ శర్మ తెరకెక్కించారు. ఇప్పుడీ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. టీవీ ప్రీమియ‌ర్ ద్వారా బుల్లితెరపై తెలుగు ప్రేక్ష‌కుల్ని అలరించనుంది. తెలుగు వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ డేట్ ఖరారు చేసుకుంది. ఫిబ్ర‌వ‌రి 18న ఆదివారం సాయంత్రం ఐదు గంట‌ల ముప్పై నిమిషాలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఇకపోతే ఈ సీక్వెల్ విజయంతో త్వరలోనే గదర్‌ 3ను కూడా రూపొందించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ వారం 20 సినిమా/సిరీస్​లు - ఆ మూడు డోంట్ మిస్​!

థియేటర్లలో డివైడ్ టాక్ -​ OTTలో ఊహించని రేంజ్​లో భారీ రెస్పాన్స్

Last Updated : Feb 12, 2024, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details