ETV Bharat / entertainment

ఈ వారం 20 సినిమా/సిరీస్​లు - ఆ మూడు డోంట్ మిస్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 10:53 AM IST

This week Release Upcoming Movies In Telugu : ఈ వారం 20 సినిమా/సిరీస్​లు అటు థియేటర్​లో ఇటు ఓటీటీలో వస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మూడు చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం..

Etv Bharat
Etv Bharat

This week Release Upcoming Movies In Telugu : ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఇంట్రెస్టింగ్ మూవీస్​, సిరీస్​ అటు థియేటర్​లో ఇటు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మూడు చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయి. వీటిలో భ్రమయుగం, ఊరు పేరు భైరవకోన, ది కేరళ స్టోరీస్​ ఇంట్రెస్టింగ్​గా అనిపిస్తున్నాయి. మరి ఏ చిత్రం ఎప్పుడు రానుంది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది? వంటి వివరాలను తెలుసుకుందాం.

మలయాళ మెగాస్టార్​ మమ్ముట్టి ఈ సారి మరో భిన్నమైన కథతో తెరపై సందడి చేయనున్నారు. భ్రమయుగం(mammootty Bramayugam). హారర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రాహుల్‌ సదాశివన్‌ తెరకెక్కించారు. ఫిబ్రవరి 15న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది.

రాజధాని ఫైల్స్‌ (Rajdhani Files)ను కంఠంనేని రవిశంకర్‌ నిర్మించారు. అఖిలన్‌, వీణ ప్రధాన పాత్రల్లో నటించారు. భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న విడుదల కానుంది. వినోద్‌కుమార్‌, వాణీ విశ్వనాథ్‌, పవన్‌, మధు, అజయ్‌రత్నం, అంకిత ఠాకూర్‌, అమృత చౌదరి తదితరులు నటించారు.

సందీప్‌కిషన్‌ హీరోగా వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona). థ్రిల్లర్‌ అండ్​ సోషియో ఫాంటసీతో ఈ సినిమా రానుంది. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలు భైరవకోన అంటూ ప్రచారం చేస్తోంది మూవీటీమ్.

జయం రవి, కీర్తి సురేష్‌ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా సైరెన్‌(Siren Movie). 108 ఉపశీర్షిక. ఆంటోనీ భాగ్యరాజ్‌ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి పోలీసు ఆఫీసర్‌గా నటించింది. అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించింది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్​లో

ఫైవ్‌ బ్లైండ్‌ డేట్స్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 13

దిస్‌ ఈజ్‌ మీ.. నౌ (హాలీవుడ్) ఫిబ్రవరి 16

నెట్‌ఫ్లిక్స్​లో

సండర్‌లెండ్‌ టిల్‌ ఐ డీ (వెబ్‌ సిరీస్‌3) ఫిబ్రవరి 13

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌ సిరీస్‌6) ఫిబ్రవరి 14

ప్లేయర్స్‌ (హాలీవుడ్) ఫిబ్రవరి 14

ఐన్‌స్టీన్‌ అండ్‌ ది బాంబ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 16

జీ5

క్వీన్‌ ఎలిజబెత్‌ (మలయాళం) ఫిబ్రవరి 14

ది కేరళ స్టోరీ (హిందీ డబ్బింగ్‌) ఫిబ్రవరి 16

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డిస్నీ+హాట్‌స్టార్‌

ట్రాకర్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 12

సబ నయగన్‌ (తమిళ) ఫిబ్రవరి 14

ఓజ్లర్‌ (మలయాళం) ఫిబ్రవరి 15

సలార్‌ (హిందీ) ఫిబ్రవరి 16

నా సామిరంగ (తెలుగు) ఫిబ్రవరి 17

ఆహా

వీరమారి లవ్‌స్టోరీ (తమిళ) ఫిబ్రవరి 14

సోనీ లివ్‌

రాయ్‌ సింఘానీ వర్సెస్‌ రాయ్‌సింఘానీ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 12

ఆపిల్‌ టీవీ ప్లస్‌

ది న్యూ లుక్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 14

బుల్లితెరపైకి రూ.600 కోట్ల బ్లాక్ బాస్టర్​ మూవీ - తెలుగు ప్రేక్షకుల కోసం స్పెషల్​గా!

థియేటర్లలో డివైడ్ టాక్ -​ OTTలో ఊహించని రేంజ్​లో భారీ రెస్పాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.