తెలంగాణ

telangana

'పుష్ప తర్వాత ఎలాంటి మార్పు లేదు - ఆ మాట సుకుమార్​కే చెప్పాను' - Fahadh Faasil Pushpa Movie

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 8:54 PM IST

Fahadh Faasil Pushpa Movie : 'పుష్ప' సినిమాలో నెగిటివ్ షెడ్స్​లో ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్. ఆ సినిమా తర్వాత ఆయన తెలుగులో బాగా ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా 'పుష్ప' సినిమా గురించి ఫహాద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలు మీ కోసం.

Fahadh Faasil Pushpa Movie
Fahadh Faasil (Source : Getty Images)

Fahadh Faasil Pushpa Movie :లెక్కల మాస్టర్ సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీ ఎంతటి సెస్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్​లో పాపులర్ అవ్వడమే కాకుండా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. దీని వల్ల హీరో అల్లు అర్జున్​తో పాటు ఇతర తారాగణం పాపులరిటీ కూడా పెరిగిపోయింది.

ముఖ్యంగా ఇందులో నెగిటివ్ షేడ్స్​ ఉన్న పాత్రలో కనిపించిన ఫహాద్‌ ఫాజిల్‌, తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఆయన ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరలవుతున్నాయి. 'పుష్ప' తర్వాత మీకు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిందా? అంటూ ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఫహాద్ చెప్పిన సమాధానం అందరినీ షాక్​కు గురిచేసింది.

"పుష్ప తర్వాత నాలో, నా కెరీర్‌లో ఎటువంటి మార్పు రాలేదు. ఇందులో దాచుకోవాల్సిన విషయం ఏం లేదు. ఇదే సంగతి నేను డైరెక్టర్ సుకుమార్‌కు కూడా చెప్పాను. ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ సినిమా తర్వాత నేనేదో మ్యాజిక్‌ చేస్తానంటూ ప్రేక్షకులు కూడా అనుకోవడం లేదు. ఇప్పుడు మలయాళం తెలియని ప్రేక్షకులు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. అది నాలో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఎప్పటికీ నా మనసంతా మలయాళ చిత్రాలపైనే ఉంటుంది. 'పుష్ప'ను సుకుమార్‌ మీద ఉన్న అభిమానంతోనే చేశాను" అంటూ తన అభిప్రయాన్ని వెల్లడించారు.

అయితే ఆయన పుష్ప సినిమాలో చేసిన ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన చెప్పిన డైలాగ్ కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఓ వైపు కామెడీ పండిస్తూనే మరోవైపు సీరియన్​నెస్​ను కూడా చూపించారు ఫహాద్​. ఇప్పుడు ఆయన 'పుష్ప 2'లోనూ నటిస్తున్నారు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం మొదటి భాగంతో పోలిస్తే రానున్న రెండో పార్ట్‌లో షెకావత్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుందట. అంతే కాకుండా హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సీన్స్​ కూడా ఉండనున్నాయని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఫహాద్​కు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సీక్వెల్‌ ఆగస్టు 15న విడుదలకు సిద్ధం కానుంది.

నా గురించి డిస్కషన్​లు పెట్టకండి : ఫహాద్​ ఫాజిల్​ - Fahadh faasil

మలయాళంలో మరో సూపర్ హిట్ - పుష్ప విలన్ 'ఆవేశం'కు అదిరిపోయే కలెక్షన్స్! - Fahad fazil Aavesham

ABOUT THE AUTHOR

...view details